శ్రీమంతుడు సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Mahesh Babu Srimanthudu Movie : కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన శ్రీమంతుడు మూవీ సమాజానికి మంచి మెసేజ్ అందించింది. ఈ సినిమా స్పూర్తితో చాలామంది గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసారు. దాంతో సూపర్ స్టార్ నిజంగానే రియల్ స్టార్ అయ్యాడు. 2015ఆగస్టు 7న రిలీజైన ఈ మూవీలో మహేష్ నటనకు తోడుగా శృతిహాసన్ అందాలు,దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అన్నీ కుదిరాయి.
185సెంటర్స్ లో 50రోజులు ఆడడం ద్వారా 90కోట్ల షేర్ తెచ్చింది. నాన్ బాహుబలి రికార్డ్ ని సొంతం చేసుకుంది. దీనికి రెండు వారాల ముందుగా జులై 24న తమిళ మూవీ జిల్లా మూవీ అనువాదంగా వచ్చింది. విజయ్ హీరోగా నంటించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. అయితే తెలుగులో ప్లాప్ అయింది.
అలాగే డిమాంటి కాలనీ హారర్ మూవీ వచ్చింది. ఇది కూడా తమిళ డబ్బింగ్. అయితే తెలుగులో నిరాశపరిచింది. సాహసం సేయరా డింభకా మూవీ కూడా జులై 24నే వచ్చింది. ఇది కూడా హర్రర్ మూవీయే. ఈ మూవీ ఫెయిల్ అయింది. అదేరోజు అల్లరి నరేష్ నటించిన జేమ్స్ బాండ్ కూడా రిలీజయింది. సాక్షి చౌదరి హీరోయిన్ గా చేసిన ఈ మూవీ నిరాశ పరిచింది.
శ్రీమంతుడికి వారం ముందుగా ఛార్మి నటించిన మంత్ర 2 మూవీ రిలీజయింది. సూపర్ హిట్ మూవీ మంత్రకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ హారర్ నేపథ్యంలోనే సాగింది. సినిమా ఫెయిల్ అయింది.అదేరోజు మిర్చిలాంటి కుర్రాడు మూవీ వచ్చింది. అభిజిత్ నటించిన ఈ మూవీ ఫెయిల్ అయింది. కమెడియన్ ధనరాజ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధనలక్ష్మి తలుపు తడితే మూవీ కామెడీ జోనర్ లో వచ్చింది. అయితే ఈ మూవీ కూడా నిరాశ పరిచింది.
జులై 31నే పాండవులలో ఒక్కడు మూవీ రిలీజయింది. ఇది కూడా ఫెయిల్ అయింది. ఇక జై హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ మూవీ ఛాలెంజ్ దారుణంగా డిజాస్టర్ అయింది. కాగా శ్రీమంతుడు వచ్చిన వారం తర్వాత వచ్చిన రవితేజ కిక్ 2 మూవీ కిక్ మూవీకి సీక్వెల్ గా వచ్చింది. రవితేజ నటన బాగున్నా, రకుల్ ప్రీత్ సింగ్ అందాలు అలరించినా సినిమా నిరాశపరిచింది. కన్నడ యాక్టర్ ఉపేంద్ర నటించిన ఉపేంద్ర 2కూడా దెబ్బతింది. రాజ్ తరుణ్ ,అవికా గౌర్ నటించిన సినిమా చూపిస్తా మావ మూవీ సూపర్ హిట్ అయింది.