పుష్ప ‘సామీ సామీ’ సాంగ్ పాడిన.సింగర్ ఎవరో తెలుసా?
Pushpa Saami Saami Song Singer Mounika Yadav : మౌనిక యాదవ్ … ఈ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేసింది. సోషల్ మీడియా పుణ్యమా మని టాలెంట్ ఉన్నవాళ్లు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నారు. అదేవిధంగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్రతిష్ఠాత్మకంగా పాన్ ఇండియా మూవీ గా వస్తున్న పుష్ప మూవీలో సామి సామి సాంగ్ తో మౌనిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఈమధ్య తెలంగాణా బ్రాండ్ ని తగిలిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ పుష్ప మూవీలో మౌనికతో పాడించి సెన్షేషన్ క్రియేట్ చేసాడు. సరిలేరు నీకెవ్వరూ మూవీలో సో క్యూట్ సాంగ్ ని మధుప్రియతో పాడించాడు. ఇప్పుడు తెలంగాణ ఫోక్ సింగర్ మౌనికతో పాడించి మరో రికార్డ్ క్రియేట్ చేసాడు. మంగ్లీ మాదిరిగా మౌనిక కు కూడా భారీ క్రేజ్ వస్తుందని అందరూ భావిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో పుట్టిన మౌనిక యాదవ్ గోదావరి ఖనిలో పెరిగింది. డిగ్రీ చేసిన ఈమె డాన్సర్, సింగర్ కూడా. స్కూల్స్ డేస్ నుంచి టీచర్స్ , ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో ఎన్నో సాంగ్స్ పాడింది. తెలంగాణ ఉద్యమంలో ఈమె గొంతు జోరుగా విన్పించింది. ఉద్యోగం చేస్తూనే సింగర్ గా కూడా రాణిస్తూ ఇప్పుడు సామి సామి సాంగ్ తో అందరి మనసులను దోచింది.