MoviesTollywood news in telugu

అరుంధతి సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?

Arundhati Movie : కోడి రామకృష్ణ దర్శకత్వంలో చాలా గ్యాప్ తర్వాత బ్లాక్ బస్టర్ ఇచ్చిన మూవీ అరుంధతి. జేజమ్మ పాత్రలో అనుష్క అదరగొట్టేసింది. ఇక వదల బొమ్మాళి అంటూ సోనూసూద్ నటన సూపర్భ్. ఎం శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ మూడింతలు లాభాలు తెచ్చిపెట్టింది.

2009 జనవరి 16న విడుదలైన హారర్ ఎంటర్ టైనర్ మూవీ 70కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఆల్ టైం 5గ్రాసర్ గా నిల్చింది. 10నంది అవార్డులను సైతం ఈ మూవీ గెలిచింది. దీనికి 15రోజుల ముందు జనవరి 1న శశిరేఖా పరిణయం మూవీ రిలీజయింది. తరుణ్, జెనీలియా జంటగా నటించిన ఈ మూవీని కృష్ణవంశీ తెరకెక్కించాడు. అరుంధతి మూవీతో ఇది కొంచెం పక్కకు జరిగింది. అయినా ఏవరేజ్ గా నిల్చింది. మణిశర్మ, విద్యాసాగర్ సంగీతం అలరించింది.

అదేరోజు పోసాని కృష్ణమురళి డైరెక్షన్ లో అతడే నటించిన మెంటల్ కృష్ణ మూవీ వచ్చింది. ఏవరేజ్ అయింది.జనవరి 1నే శివాజీ హీరోగా ఇందుమతి మూవీ వచ్చింది. హర్షారెడ్డి హారర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. అలాగే మహానగరంలో మహా చందు మూవీ రిలీజయింది. యశ్వంత్ ,పూనమ్ సింగ్ నటించిన ఈ మూవీ నిరాశపరిచింది.

సికిందర్, కీర్తి నటించిన కవి మూవీ కూడా ఫెయిలయింది. కన్నడ హీరో సుదీప్ నటించిన దౌర్జన్యం మూవీ రిలీజయింది. ఇది తెలుగులో నిరాశపరిచింది. నాగబాబు ప్రధాన పాత్రలో వచ్చిన పోలీసు అధికారి మూవీ కూడా పరాజయం పాలైంది. ఇక జనవరి 14న రామ్ పోతినేని నటించిన మస్కా మూవీ వచ్చింది. హన్సిక గ్లామర్ కూడా తోడవడంతో తొలివారం 10కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బి గోపాల్ తీసిన ఈ మూవీ ఎబో ఏవరేజ్ గా నిల్చింది.

ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఫిటింగ్ మాస్టర్ మూవీ బాగానే ఉన్నా అరుంధతి దెబ్బకి ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. అరుంధతి మూవీ వారం తర్వాత శివాజీ నటించిన మస్త్ మూవీ వచ్చింది. శివబాలాజీ కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్టర్. అయితే ఇది కూడా ఫెయిల్ అయింది.

జనవరి 23నే మిస్టర్ గిరీశం మూవీ వచ్చింది. కృష్ణ భగవాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈమూవీ లో రమ్యకృష్ణ నటించింది. అయితే ఈ మూవీ రాణించలేదు. అదేరోజు ష్ మూవీ వచ్చినా, ఫెయిల్ అయింది. అరుంధతి తర్వాత 8రోజులకు నల్లబ్బాయి తెల్లమ్మాయి మూవీ రిలీజయింది. ఇదీ ఫెయిలయింది.

సాయికుమార్ హీరోగా నటించిన ఢీ అంటే ఢీ మూవీ కూడా ఫెయిలయింది. బాలాదిత్య నటించిన వేట మూవీ కూడా నిరాశపరిచింది.భారత్ మహాన్, బ్యాంకు అనే మూవీస్ కూడా నిరాశపరిచాయి. అయితే రియల్ స్టార్ శ్రీహరి నటించిన శ్రీశైలం, గౌతమ్ శ్రీదేవి నటించిన మంజీర మూవీస్ నిరాశ పరిచాయి.