జీవన పోరాటం సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
Shobhan babu and Rajanikant Movie Jeevana Poratam : నటభూషణ్ శోభన్ బాబు హీరోగా తీసిన డాక్టర్ బాబు,జీవనపోరాటం ఈ రెండు చిత్రాలు హిందీ మూవీస్ కి రీమేక్ గా వచ్చాయి. నటుడు మనోజ్ కుమార్ మూడేళ్లు కష్టపడి రోటీ కపడా ఔర్ మకాన్ మూవీ చేసాడు. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్, శశికపూర్ కూడా నటించారు. అయితే ఈ మూవీ రీమేక్ హక్కులు డాక్టర్ డి రామానా యుడు సుబ్బరామిరెడ్డి,శశిభూషణ్ కొన్నారు. ఈ సినిమా చేయడానికి శోభన్ బాబు ఒకే చెప్పడమే కాదు, వరుసగా 35రోజులు డేట్స్ ఇవ్వడం విశేషం.
శోభన్ బాబుతో కల్సి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కల్సి నటించిన ఒకే ఒక చిత్రం ఇది. హిందీలో అమితాబ్ పాత్రను తెలుగులో రజనీకాంత్ చేసాడు. నిజానికి యాక్షన్ కింగ్ అర్జున్ పేరును అనుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో గానీ రజనీకాంత్ ఆయన ప్లేస్ లో వచ్చారు. రామ్ రాబర్ట్ రహీం తర్వాత ఐదేళ్ల విరామం తీసుకుని తెలుగులో రజనీకాంత్ నటించిన మూవీ కూడా జీవనపోరాటమే. విజయశాంతి హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో హిందీ నటి మీనాక్షి శేషాద్రి స్పెషల్ సాంగ్ లో పాల్గొంది. రజనీకాంత్,మీనాక్షి లపై ముంబైలో ఈ సాంగ్ షూట్ చేసారు.
హిందీలో శశికపూర్ పాత్రను తెలుగులో శరత్ బాబు చేసాడు. నరేష్ పోలీసాఫీసర్ గా చేసాడు. రాధిక కూడా హీరోయిన్ గా చేసింది. రాజాచంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1986ఏప్రియల్ 10న రిలీజయింది. తెలుగులో 55,తమిళంలో 25,కేరళలో 10ప్రింట్స్ తో రిలీజైన తొలిచిత్రం కూడా ఇదే. మంచి సాంగ్స్,బలమైన కధనం ఈ మూవీ సక్సెస్ కి దోహదపడ్డాయి. శోభన్ బాబు నటవిశ్వ రూపం ప్రదర్శించిన మూవీ ఇది. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో 37రోజులు మాట్ని షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఎబో ఏవరేజ్ గా నిల్చింది. అయితే నాగార్జున మూవీ విక్రమ్ కోసం సంధ్య థియేటర్ లో 47రోజులకే తీసేసారు.