మహేష్ బాబు ‘ఆగడు’ సినిమా ప్లాప్ అవ్వటానికి అసలు కారణం ఇదే…!
Mahesh Babu agadu Movie :సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో దూకుడు సినిమా అభిమానులను అలరించడమే కాదు,కలెక్షన్స్ పరంగా దూకుడు చూపించింది. అయితే ఆగడు సినిమా మాత్రం నిరాశ పరిచింది. ఈ రెండు సినిమాలకు శ్రీను వైట్ల డైరెక్టర్. ఇటీవల అలీతో సరదాగా ప్రోగ్రాం కి వచ్చిన సందర్బంగా కొన్ని విషయాలను శ్రీను వైట్ల షేర్ చేసుకున్నాడు.
రవితేజతో 1999లో నీకోసం మూవీ చేసినపుడు రామోజీరావు సినిమా బాగుందని సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా తనకు ఆనందం మూవీలో ఛాన్స్ ఇచ్చారని, శ్రీను వైట్ల చెప్పాడు. సొంతం,వెంకీ,అందరివాడు,దూకుడు, ఢీ,దుబాయ్ శీను,కింగ్,ఆగడు వంటి మూవీస్ చేసినట్లు వివరించాడు.
దూకుడు మూవీ హిట్ కావడంతో మహేష్ బాబుతో ఆగడు స్టార్ట్ చేసానని, స్టైలిష్ గా సినిమా తీశానని అయితే మాస్ ఎలిమెంట్స్ కోరుకున్న ఫాన్స్ కి సినిమా నచ్చలేదని శ్రీను వైట్ల చెప్పాడు. దూకుడుకి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత గా నంది అవార్డుతో పాటు ఉత్తమ డైరెక్టర్ గా కూడా అవార్డు అందుకున్న శ్రీను వైట్ల ఆగడు మూవీతో నిరాశ చెందాడు.