MoviesTollywood news in telugu

టాలీవుడ్ లో సత్తా చూపిస్తున్న లేడీ డైరెక్టర్స్..ఎంత మంది ఉన్నారో…?

Tollywood Lady Directors: ఒకప్పుడు భానుమతి రామకృష్ణ,సావిత్రి,విజయనిర్మల ఇలా కొద్దీ మాత్రమే హీరోయిన్స్ గా సత్తా చాటి దర్శకులుగా కూడా తమ ప్రతిభను చూపారు. స్టార్ హీరోయిన్‌గా ఉన్నపుడే దర్శకురాలిగానూ లెజెండరీ నటి భానుమతి సత్తా చూపించారు. అందునా విజయ నిర్మల దాదాపు 45 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి అత్యధిక సినిమాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. ఆ మధ్య మరణించారు.

అయితే ప్రస్తుతం మహిళా దర్శకులు బానే వస్తున్నారు. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీ ప్రియ.. దర్శకురాలిగానూ సత్తా చూపించారు. 2014లో వెంకటేష్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకుంది.

అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ లాంటి విజయాలతో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తన సత్తా చాటింది. గురు సినిమాతో దర్శకురాలు సుధా కొంగర తెలుగు ఇండస్ట్రీలో విజయం అందుకుని..ఆకాశమే నీ హద్దురాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుని,ఈమె స్టార్ డైరెక్టర్ గా నిల్చింది.

చంటిగాడు సినిమాతో డైరెక్టర్ గా మారిన జయ ఆ తర్వాత అరడజను సినిమాలకు పైగానే తెరకెక్కించారు. అనారోగ్యం కారణంగా మూడేళ్ళ కింద ఈమె మరణించారు.

గీత రచయిత చంద్రబోస్ భార్య సుచిత్ర గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పల్లకిలో పెళ్లి కూతురు సినిమా డైరెక్ట్ చేసింది. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన రాజు గాడు సినిమాతో సంజన రెడ్డి దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన లక్ష్మీ సౌజన్య వరుడు కావలెను మూవీతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది.

ఇందులో నాగ శౌర్య, రితూ వర్మ జంటగా నటించారు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర పదేళ్లుగా శిష్యరికం చేస్తున్న గౌరీ.. ఈ మధ్యే శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. దసరాకు విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది.