మీరా జాస్మిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
Tollywood actress meera jasmine : తెలుగులో దాదాపు 10 సినిమాలకు పైనే నటించిన మీరా జాస్మిన్ తెలుగు ఆడియన్స్ లో మంచి పేరే తెచ్చుకుంది. ముఖ్యంగా బోయపాటి శ్రీను, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన భద్ర మూవీలో ఈమె నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ఈమె గురించి వార్తలొస్తున్నాయి.
మలయాళీ భామ అయిన మీరా జాస్మిన్ 2008లో మాండలిన్ రాజేష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. పెళ్లయ్యాక ఇద్దరి మధ్యా విబేధాలు రావడంతో విడిపోయారు. దాంతో ఆమె విడిగానే ఉంటోంది. దీంతో సినిమాల్లో నటించడానికి రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి.
అయితే మీరా తెలుగులో కాకుండా మలయాళీ మూవీ లో నటిస్తోందట. దర్శకుడు సత్యాన్ అంటికండ్ డైరెక్షన్ లో మలయాళ నటుడు జయరాం కీలక పాత్ర పోషిస్తున్న సినిమాలో హీరో భార్యగా మీరా కన్పిస్తోందని టాక్. అయితే ఈ అమ్మడికి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో తెలుగులో కూడా నటిస్తుందని ఆశిస్తున్నారు.