ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ నైనిక రియల్ లైఫ్
Ennenno janmala bandham serial nainikha real life : తెలుగునాట బుల్లితెరపై సీరియల్స్ కి కొదవలేదు. ఒకదాన్ని మించి మరో సీరియల్ రన్నవుతోంది. స్టార్ మా ఛానల్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మొదలైన కొద్దిరోజులకే మంచి పాపులార్టీ తెచ్చుకుంది. ఈ సీరియల్ లో నటీనటులు తమ అందంతో, అభినయంతో ఆకట్టుకుంటున్నారు.
హీరో యాష్ కి కూతురిగా నటిస్తున్న ఖుషి తన నటనతో ముఖ్యంగా చిలిపి తనంతో ఆడియన్స్ ని బాగా అలరిస్తోంది. ఈమె అసలు పేరు నైనిక. ఈమె అక్టోబర్ 2న తెలంగాణలోని సంగారెడ్డిలో జన్మించింది. తండ్రి రవికాంత్ ఫోటోగ్రాఫర్. తల్లి గృహిణి.
టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన నైనిక పలు ఫొటోస్, వీడియోస్ తండ్రి సాయంతో Instagram లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.