గీత గోవిందం సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Vijay Devarakonda Geetha Govindam Movie : విజయ్ దేవరకొండ కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ గీత గోవిందం. రష్మిక మందన్న హీరోయిన్ గా చేసిన ఈ మూవీని పరశురామ్ తెరకెక్కించాడు. అప్పటికే అర్జున్ రెడ్డి మూవీతో ఫామ్ లోకి వచ్చిన విజయ్ కి గీతగోవిందం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి, భారీ వసూళ్లు తెచ్చింది. 2018లో వచ్చిన ఈ మూవీ 400కి పైగా సెంటర్స్ లో 25రోజులు ఆడి, 100కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
దీనికి 12రోజుల ముందుగా 2018 ఆగస్టు 3న అడవి శేషు హీరోగా వచ్చిన గూఢచారి మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. శశికిరణ్ టిక్కా డైరెక్ట్ చేసాడు. ఇదే రోజున కొత్తవాళ్లతో హర్రర్ అండ్ రొమాంటిక్ మూవీ దేవి విగ్రహం మూవీ వచ్చింది. అయితే ఇది పరాజయం పాలైంది.
ఇదే రోజున వచ్చిన యువతరం మూవీ కూడా నిరాశపరిచింది. బాహుబలి ప్రభాకర్ నెగెటివ్ షేడ్ లో చేసిన మన్యం మూవీ హర్రర్ నేపథ్యంలో వచ్చి పరాజయం చవిచూసింది. అలాగే అదేరోజు తరువాత ఎవరు మూవీ రిలీజయింది. కమల్ కామరాజు, ప్రియాంక శర్మ ప్రధాన రోల్స్ లో నటించిన ఈ మూవీ నిలబడలేదు.
అదేరోజు శివకాశీపురం మూవీ రిలీజయింది. రాజేష్, ప్రియాంక నటించిన ఈ మూవీలో కొన్ని సీన్లు ఆకట్టుకున్నాయి. అయితే హర్రర్ కి భిన్నంగా సుశాంత్, రోహాని జంటగా వచ్చిన చి ల సౌ మూవీ ఎబో ఏవరేజ్ అయింది. బ్రాండ్ బాబు మూవీ కూడా ఆగస్టు 3నే వచ్చింది. ఇదీ ఫెయిల్ అయింది.
గీత గోవిందం కి 9రోజుల ముందుగా ఆగస్టు 9న నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం మూవీ రిలీజయింది. సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బిలో ఏవరేజ్ అయింది. ఆగస్టు 10న విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2మూవీ వచ్చింది. అయితే విశ్వరూపం మూవీకి సీక్వెల్ గా వచ్చి ప్లాపయింది. కమల్ డైరెక్షన్ లోనే ఈ మూవీ వచ్చింది.
గీతగోవిందం రిలీజైన రెండు రేజుల తర్వాత ఆగస్టు 17న ఝాన్సీ మూవీ వచ్చింది. జ్యోతిక పోలీసాఫీసర్ గా చేసిన ఈ మూవీలో కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ సినిమా ఆడలేదు. ఇక ఆగస్టు 24న ప్రభుదేవా నటించిన లక్ష్మి మూవీ రిలీజయింది. ఇదీ ప్లాపయింది. రష్మీ గౌతమ్ , జయరాజ్ నటించిన అంతకుమించి మూవీ నిరాశపరిచింది.
నారా రోహిత్ , జగపతి బాబు నటించిన ఆటగాళ్లు మూవీ కూడా ఆగస్టు 24నే వచ్చి నిరాశపరిచింది. ఆది పినిశెట్టి హీరోగా చేసిన నీవెవరో మూవీ కూడా అదే రోజు వచ్చి ప్లాపయింది. దీంతో గీతగోవిందం నెంబర్ వన్ స్థానంలో నిల్చింది.