స్టైలిష్ స్టార్ అన్నయ్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?
allu arjun brother bobby : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎన్నో హిట్ మూవీస్, బ్లాక్ బస్టర్ మూవీస్ తీశారు. ఆయన కొడుకు అల్లు అర్జున్ హీరోగా ఎస్టాబ్లిష్ అయి, స్టైలిష్ స్టార్ గా రాణిస్తున్నాడు. మరో కుమారుడు శిరీష్ కూడా హీరోగా చేస్తున్నాడు. అయితే ఓ పక్క తండ్రి, మరోపక్క కుమారులు ఇలా సక్సెస్ సాధిస్తున్నారంటే వారి వెనుక మరో వ్యక్తి ఉన్నాడు. అతడే అల్లు వెంకటేష్.
అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ ని అందరూ బాబీ అని పిలుస్తారు. విదేశాల్లో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ పూర్తిచేసాడు. టెక్నాలజీ ఇంటర్ ప్రీటర్ కెరీర్ స్టార్ట్ చేసిన బాబీ ఎన్విరాన్ మెంట్ అండ్ ఎంబెడ్ మెంట్ సిస్టమ్స్ కోసం గత 15ఏళ్లుగా కృషిచేస్తున్నాడు.
జస్ట్ టికెట్స్ పేరిట తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్స్ పోర్టల్ పెట్టి సక్సెస్ అయ్యాడు. దానికి చైర్మన్ గా ఉన్నాడు. అంతేకాదు, కరోనాకు ముందే ఆహా ఓటిటి ఏర్పాటులో బాబీ కీలక పాత్ర పోషించాడు. ఇలా తెరవెనుక కృషిచేస్తున్న యితడు తాజాగా మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తో గని మూవీ నిర్మిస్తున్నాడు.