శ్యాం సింగరాయ సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో…?
Nani shyam singha roy Movie :నేచురల్ స్టార్ నాని డబుల్ రోల్ చేస్తున్న శ్యాం సింగరాయ మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. అయితే చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమా కథను మొదటగా భల్లాల దేవుడు దగ్గుబాటి రానాకు వినిపించాడట.
ఎందుచేతనో ఈ కథను రానా రిజెక్ట్ చేసాడట. దాంతో ఈ ప్రాజెక్ట్ నాని దగ్గరకు చేరింది. సినిమాలో చాలా ఇంటరెస్టింగ్, ఆశ్చర్యం గొలిపే సన్నివేశాలు ఉన్నాయని సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందని నాని బలంగా నమ్ముతున్నాడు.
దానికి తోడు ఈ మధ్య రిలీజైన శ్యాం సింగరాయ మూవీ టైటిల్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టాక్సీ వాలా తర్వాత డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తీస్తున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.