MoviesTollywood news in telugu

టాలీవుడ్ లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాలు…మీరు ఎన్ని చూశారు

james bond movies telugu :హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ మూవీస్ కోకొల్లలు. అయితే ఇదే బాణీ అందుకుని సూపర్‌ స్టార్‌ కృష్ణ, తెలుగులో మొదటిసారి జేమ్స్‌ బాండ్‌ మూవీ చేసి కొత్తదనం చూపించారు. గూఢచారి 116 పేరిట వచ్చిన ఈ చిత్రంలో జయలలిత హీరోయిన్ గా చేసింది. మల్లికార్జు న రావు దర్శకత్వం వహించారు.

పలు నేరాలకు సాక్ష్యాలైన ఫొటో ఎవిడెన్స్‌ కోసం సీక్రెట్‌ ఏజెంట్‌ 303ను ఇంటర‍్నేషనల్‌ క్రిమినల్‌ గ్యాంగ్‌ హత్య చేయడంతో చేధించడానికి ఏజెంట్‌ 116కు సీఐడీ అప్పగిస్తుంది. దానిని ఏజెంట్ 116 ఎలా చేధించాడనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆవిధంగా తెలుగులో జేమ్స్ బాండ్ మూవీస్ కి కృష్ణ ఆద్యుడు.

తర్వాత ఏజెంట్ గోపి, గూడచారి 117వంటి పలు చిత్రాల్లో కృష్ణ నటించి జేమ్స్ బ్యాండ్ మూవీస్ కి కేరాఫ్ ఎడ్రెస్ అయ్యారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో గూఢచారి నెం.1 వచ్చింది. రాధిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 1983లో విడుదలై హిట్‌ టాక్‌ అందుకుంది. నెంబర్‌ 1 అనబడే ఒక ప్రభుత్వ ఏజెంట్ దేశద్రోహుల్ని ఎలా పట్టుకున్నాడనే అంశాలతో తెరకెక్కించారు.

గతంలో కమల్ హాసన్ కొన్ని సినిమాల్లో జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో నటించినప్పటికీ 60 ఏళ్ల వయసులో కమల్ హాసన్ ‘విశ్వరూపం’ మూవీలో భారత్ జేమ్స్‌బాండ్‌గా నటించి, తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మూవీ కోసం చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తున్నాయి. అయితే దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘విశ్వరూపం2’ నిరాశ పరిచింది.

ఇక ఇప్పుడున్న యంగ్ హీరోల్లో అడవి శేష్‌ నటించిన గూఢచారి చిత్రం 2020లో విడుదలై, బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి ఫలితం దక్కించుకుంది. పూర్తిగా జెమ్స్‌ బాండ్‌ తరహాలో వచ్చిన ఈ చిత్రంలో తన నటనతో అడవి శేష్ ప్రేక్షకులను మెప్పించాడు. దీనికి సీక్వెల్‌గా గూఢచారి 2 ను తెరకెక్కిస్తున్నారు.

కాగా గోపిచంద్‌ హీరోగా నటించిన చాణక్య మూవీలో ‘రా’ ఏజెంట్‌గా మెప్పించాడు. అబ‍్బూరి రవి అందించిన కథను డైరెక్టర్‌ తిరు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు బానే రాబట్టింది. మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌ చేయబోతున్న సినిమాను జేమ్స్‌ బాండ్‌ తరహాలో రూపొందిస్తున్నట్లు టాక్‌.