నాగ్ షర్ట్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాలసిందే..!
King Nagarjuna Paisley Silk Shirt Cost : అరవై దాటినా 20ఏళ్ళ కుర్రాడిలా యంగ్ హీరోలతో పోటీపడి నటిస్తూ మన్మధుడిలా ఉన్న అక్కినేని నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ ఈ మధ్యే రిలీజ్ కాగా తాజాగా ‘ది ఘోస్ట్’, ‘బంగార్రాజు’సినిమాలు చేస్తున్నాడు. ఇక మరో పక్క బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో కి వరుసగా మూడోసారి హోస్ట్‌గా చేస్తున్నాడు. యాంకరింగ్ లో కూడా యంగ్‌లుక్స్‌తో స్టైలిష్‌గా నాగార్జున ఈ షోలో తన సత్తా చాటుతున్నాడు.
ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్స్‌లో నాగార్జున కాస్ట్యూమ్స్ కోసం ప్రత్యేక శైలి కనబరుస్తూ ఉంటాడు. మామూలుగానే సెలబ్రిటీలు ఏ చిన్న విషయమైనా చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇక నాగార్జున ధరించిన ఓ షర్ట్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ లో నాగ్ కనిపించాడు. దీంతో లెమన్ ఎల్లో కలర్‌లో ఉన్న ఈ షర్ట్ ఖరీదు గురించి నెటిజన్లు ఆరా తీశారు. తీరా ధర తెలిసాక షాకయ్యారు. ఈ షర్ట్ ధర దాదాపు $1310 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో అయితే సుమారు 83,908 రూపాయలు. ఏడైనా టాలీవుడ్ మన్మథుడుకి ఆ మాత్రం ఉండాలని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.