రోజుకి 1 లడ్డు…నరాలు,ఎముకల బలహీనత,పాదాల నొప్పి,మైకం,డయబెటిస్ జీవితంలో ఉండవు
Nerve weakness food in Telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. సమస్య రాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడిపోతుంటారు. కంగారు పడకుండా ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలా మంచి ఫలితం కనబడుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉంటాయి.
అలాగే నడిచినప్పుడు తేలిపోతున్న భావన ఉండటం, అలాగే రాత్రి పడుకున్నప్పుడు కండరాలు పట్టేయడం శారీరక బలహీనత, శరీరంలో అసలు బలం లేనట్టు ఉండటం, అలసట, నిస్సత్తువ ఉండి ఏ పని చేయాలని అనిపించకపోవడం అధిక రక్తపోటు ముఖం కాంతి విహీనంగా మారడం, కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు అన్నింటిని ఇప్పుడు తయారు చేసుకునే లడ్డు పరిష్కరిస్తుంది..
ఒక కప్పు అవిసె గింజలు గింజలు,ఒక కప్పు తెల్ల నువ్వులు వెగించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసి దానిలో 10 బాదం పప్పులు,10 కిస్ మిస్ లను వేసి వెగించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసి గోదుమ పిండి వేసి వెగించాలి.
ఆ తర్వాత కప్పున్నర బెల్లం తీగ పాకం కన్నా తక్కువగా పాకం పట్టుకోవాలి. ఒక బౌల్ లో అవిసెగింజల,నువ్వుల పొడి,బాదం,కిస్ మిస్ ల పొడి,గోదుమ పిండి,బెల్లం పాకం వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను రోజుకి ఒకటి తీసుకుంటే పైన చెప్పిన అన్నీ సమస్యలు తొలగిపోతాయి.
ఈ లడ్డు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక్కసారి చేసుకుంటే పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అన్నీ వయస్సుల వారు ఈ లడ్డును తినవచ్చు.