MoviesTollywood news in telugu

“లేడీ డిటెక్టివ్” సీరియల్ లో నటించిన ఉత్తర ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Lady Detective Serial Uttara Real life : లేడీ డిటెక్టివ్ సీరియల్ లో నటించిన ఉత్తర కర్ణాటక అమ్మాయి. ఏ ఇంట్లో సమస్య ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా లేడి డిటెక్టివ్ అక్కడ వాలిపోయి ఆ సమస్యను పరిష్కరించేది. ఈ సీరియల్ తో ఉత్తర తెలుగునాట మంచి పేరు తెచ్చుకుంది.

ఇప్పటికీ ఉత్తర అనగానే లేడి డిటెక్టివ్ సీరియల్ ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది. ఈమె మొదటగా డబ్బింగ్ మూవీ రంభ ఊర్వశి మేనక మూవీలో నటించింది. తర్వాత తమిళంలో వైదేహి కళ్యాణం అనే మూవీలో శరత్ కుమార్ కూతురుగా చేసింది. 1993లో శ్రీకాంత్, జెడి చక్రవర్తి హీరోలుగా చేసిన వన్ బై టు అనే తెలుగు మూవీలో నటించింది.

1995లో ఈటివి స్టార్టు కావడంతో జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన అబద్ధాల పెళ్లిళ్లు అనే సీరియల్ లో నటించింది. చిన్నా, శివాజీ రాజా ఇందులో నటించారు. ఈటివి సుమన్ డైరెక్షన్ లో వచ్చిన వసుంధర సీరియల్ లో భాగంగా స్వేచ్ఛ అనే సీరియల్ లో ఉత్తర నటించింది. భారతి, సంజయ్ భార్గవ్ లు ఇందులో నటించారు.

ఇక ఈటివి ప్రధమ వార్షికోత్సవం సందర్బంగా ఆరంభమైన లేడీ డిటెక్టివ్ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ టైటిల్ సాంగ్ వస్తుంటే చాలు జనం టివికి అతుక్కుపోయేవారు. శోధన అనే రోల్ చేసింది ఉత్తర. ఈమెకు అసిస్టెంట్స్ గా సాక్షి రంగారావు, రమాప్రభ నటించారు. ఈ సీరియల్ హిట్ కావడంతో కోరుకున్న ప్రియుడు మూవీలో 1997లో ఛాన్స్ దక్కించుకుంది.

1998లో లైఫ్ లో వైఫ్ అనే మూవీలో కూడా చేసింది. అదే ఏడాది కన్నడ మూవీలో చేసింది. 90వ దశకంలో సీరియల్స్, సినిమాల్లో నటించిన ఉత్తర బుల్లితెర, వెండితెరకు సడన్ గా దూరమై, ప్రస్తుతం ఎక్కడ ఉందొ తెలీదు.