MoviesTollywood news in telugu

సూర్య “జై భీమ్” సినిమా చేయటానికి అసలు కారణం ఇదేనట…!

Surya Jai Bhim Movie :థియేటర్ లో కాకుండా ఓటిటి వేదికగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజైనప్పటికీ జైభీమ్ మూవీ విశేషంగా జనాన్ని ఆకట్టుకుంది. ఈ సినిమాపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలతో ప్రయోగాలు చేసే హీరో సూర్య ఈ సినిమాలో లాయర్ పాత్రలో అదరగొట్టాడు. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు.

అయితే ఈ మూవీలో నటించడానికి గల కారణాన్ని తాజాగా సూర్య షేర్ చేసుకుంటూ లాయర్ చంద్రు సామాన్యుల కోసం కేసులు వాదించడం, ఫీజు తీసుకోకుండా కూడా కేసులు వాదించి న్యాయం చేయడం తనకు బాగా నచ్చిందని, పైగా లాయర్ పాత్రలో కూడా ఇంతవరకూ నటించకపోవడంతో వెంటనే ఒకే చెప్పానని వివరించాడు. దర్శకుడు జ్ఞాన వేల్ యదార్ధ గాధ ఆధారంగా తీసిన ఈ సినిమా కథ చెబుతున్నప్పుడే ఆసక్తి రేకెత్తించిందని సూర్య చెప్పాడు.

అందుకే లాయర్ చంద్రు వాదించిన కేసులు, వాటి పూర్వాపరాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పాత్రలో లీనమై నటించానని సూర్య చెప్పాడు. ఇలాంటి పాత్రలో చేసినందుకు చాలా గర్వంగా ఉందని, పైగా బ్లాక్ బస్టర్ కావడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాడు. న్యాయం కోసం చిన్నతల్లి అనే యువతి చేసిన న్యాయ పోరాటం ఈ సినిమాలో విశేషంగా అలరిస్తోంది. ప్రతి సన్నివేశం రక్తి కట్టింది.