MoviesTollywood news in telugu

అలనాటి నటి వాణిశ్రీ కుటుంబం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Tollywood star actress vanisree : మహానటి సావిత్రి తర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకుని, దాదాపు రెండు దశాబ్దాలు ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్ వాణిశ్రీ అప్పటి అగ్ర హీరోలు అందరి సరసన నటించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం దుమ్మురేపింది. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, సీతారత్నం గారబ్బాయి, ఏవండీ మీ ఆవడి వచ్చింది .. వంటి చిత్రాలతో సెకండ్ ఇన్నింగ్స్ అదరగొట్టింది.

వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. మెట్రిక్యులేషన్ వరకూ చదివిన ఈమె భరతనాట్యం కూడా నేర్చుకుంది. చిన్నతనంలోనే తండ్రిని, అక్కను, ఇద్దరు తమ్ముళ్లను ఈమె కోల్పోయింది. మీ అమ్మాయి అచ్చం సావిత్రిలా ఉంటుందని తల్లి వెంకమ్మతో అంటూ ఉండేవారట. దాంతో వాణిశ్రీకి సినిమాలపై మక్కువ ఏర్పడింది.

ముందుగా నాటకాల్లో వేసింది. తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మరపురాని కథ మూవీతో హీరోయిన్ అయింది. అయితే నాదీ ఆడజన్మే మూవీ సమయంలో ఈమె పేరు వాణిశ్రీగా ఎస్వీ రంగారావు మార్చారు. ఇక తొలి రోజుల్లో కామెడీ రోల్స్ కి పరిమితమైనా, వాణిశ్రీగా పేరు మార్పుతో హీరోయిన్ గా మంచి రోల్స్ చేసింది.

ఎన్టీఆర్, అక్కినేని వంటి అప్పటి అగ్ర హీరోలతో పాటు శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి హీరోలతో చేసి మెప్పించింది. ఆరోజుల్లో అమ్మాయిలు వాణిశ్రీలా ఉండడానికి ఇష్టపడేవారు. దాదాపు 20ఏళ్ళు ఇండస్ట్రీని ఏలిన ఈమె ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. కేరీర్ చివరికి చేరి, ఛాన్స్ లు తగ్గే సమయంలో పెళ్ళిచేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.

వాణిశ్రీకి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరూ కూడా జీవితంలో బాగా స్థిరపడ్డారు. ప్రస్తుతం వాణిశ్రీ సినిమాలకు దూరంగా ఉన్నా సరే మంచి పాత్రలు వస్తే చేయటానికి సిద్దంగా ఉన్నారు.