MoviesTollywood news in telugu

ఈటీవీ లో రాత్రి 7.30 కు ప్రసారమైన డైలీ సీరియల్స్…ఎన్ని చూశారు

Eetv serials :టివి ఛానల్స్ లో ప్రస్తుతం సీరియల్స్ కి కొదవలేదు. అయితే ఒకప్పుడు వారానికి ఒక సారి సీరియల్ ప్రసారమయ్యేది. తర్వాత డైలీ సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక రోజుకి ఒక్కో ఛానల్ లో పదుల సంఖ్యలో కూడా సీరియల్స్ వస్తున్నాయి. ఇక ఈటీవీలో ప్రతిరోజూ రాత్రి 7న్నరకు ప్రసారమైన సీరియల్స్ లోకి వెళ్తే, 1998లో మనసు గీసిన బొమ్మ డైలీ సీరియల్ ప్రసారం స్టార్ట్ అయి, సోమవారం నుంచి గురువారం వరకూ ప్రసారమయ్యేది.

భానుచందర్, నిరోషా, పృథ్విరాజ్ వంటివాళ్ళు నటించారు. దీని తర్వాత నిరోషా, పృథ్విరాజ్ తదితరులు నటించిన నందిని సీరియల్ అదే ఏడాది వచ్చింది. ఇక అదే ఏడాది రాధిక ప్రధాన పాత్రలో ఇది కథ కాదు సీరియల్ ప్రసారమైంది. 550 భాగాలుగా ఇది ప్రసారమైంది. కొన్నాళ్ళు గురువారం వరకూ తర్వాత శుక్రవారం వరకు ఈ సీరియల్ ప్రసారమైంది.

ఇదే సమయానికి 2001లో అక్కాచెల్లెళ్లు సీరియల్ స్టార్ట్ అయింది. శ్రీవిద్య, అశ్విని, ప్రగతి, భావన తదితరులు నటించిన ఈ సీరియల్ కొన్నాళ్ల తర్వాత రాత్రి 10న్నరకు మారింది. దీని తరువాత అదే ఏడాది మనోయజ్ఞం సీరియల్ మొదలైంది. కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో చిన్న పిల్లలను ఆకట్టుకునేలా రూపొందించారు.

రాజ్ కుమార్, సమీర్, ఝాన్సీ తదితరులు నటించారు. అయితే ఇది కూడా కొన్నాళ్ల తర్వాత రాత్రి 9న్నరకు మారింది. 2002లో కె బాలచందర్ డైరెక్షన్ లో ఇంద్రజ, ఏడిద శ్రీరామ్, సుధాకర్ తదితరులు నటించిన వదిన సీరియల్ స్టార్ట్ అయింది. 2003లో ఇదే స్లాట్ లో జయం సీరియల్ స్టార్ట్ చేసారు. అనూష, ప్రసాద్ బాబు, సాధన, కవిత, శ్రీలక్ష్మి, లక్షీరాజా తదితరులు నటించారు.

ఇది పూర్తయ్యాక 2005లో నాతిచరామి స్టార్ట్ చేసారు. ఇది తర్వాత కేవలం శుక్రవారం రాత్రి 7న్నరకు మాత్రమే ప్రసారమయ్యేది. తర్వాత రాత్రి 10న్నరకు మారింది. గీతాంజలి సీరియల్ 2006లో స్టార్ట్ అయింది. హేమాశ్రీ, సంఘమిత్ర తదితరులు నటించిన ఈ సీరియల్ గురువారం వరకూ మాత్రమే ప్రసారమయ్యేది.

దీని తర్వాత 2007లో చంద్రముఖి స్టార్ట్ చేసారు. నిరుపమ్, మంజుల ప్రీతినిగమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరియల్ తర్వాత రాత్రి 7గంటలకు, తర్వాత రాత్రి 8గంటలకు మార్చారు. 2008లో రాత్రి 7న్నరకు మనసు చూడ తరమా సీరియల్ స్టార్ట్ చేసారు. దీన్ని కొన్నాళ్ళు రాత్రి 8న్నరకు మార్చారు. 2009లో బాంధవ్యాలు 7న్నరకు ప్రసారమయ్యేది. పవిత్ర లోకేష్, ఆహుతి ప్రసాద్, తదితరులు నటించారు.

అదే ఏడాది తూర్పు వెళ్లే రైలు ఇదే సమయానికి స్టార్ట్ అయింది. శ్రీదివ్య, వనజ, చాందిని నటించిన ఈ సీరియల్ మల్లెమాల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తీశారు. శుక్రవారం నడిచిన ఈ సీరియల్ తరవాత శనివారం వరకూ పొడిగించారు. 2013లో మనసు మమత సీరియల్ స్టార్ట్ అయింది. శనివారం వరకూ ప్రతిరోజూ వచ్చే ఈ సీరియల్ 2021వరకూ విజయవంతంగా నడిచింది. నవంబర్ 17తర్వాత రంగుల రాట్నం మల్లెమాల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్రసారం కాబోతోంది.