ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్…గుర్తు పట్టారా…?
Tollywood anchor sreemukhi : సోషల్ మీడియా విస్తృతి పెరిగాక సెలబ్రిటీలతో పాటు యాంకర్స్, ఇతర నటులు కూడా తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఫోటోలు, వీడియోలను ఫాన్స్ చాలా పదిలంగా దాచుకుంటారు. తమ అభిమాన హీరోయిన్స్, యాంకర్స్ చిన్ననాటి ఫోటోలను కూడా చూసి మురిసిపోతుంటారు. లైక్, కామెంట్స్, షేర్స్ చేస్తారు. దీంతో ఇలాంటి ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా ఓ అందాల యాంకర్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఫోటోలను ఫాన్స్ తెగ షేర్ చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఆ బ్యూటీ ఇప్పుడు స్టార్ యాంకర్ గా బుల్లితెరపై అదరగొడుతోంది. ఆమె ఎవరో కాదు, బుల్లితెరపై తన అందంతో చలాకీతనంతో అలరిస్తున్న శ్రీముఖి.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ నిత్యం తన ఫొటోలతో.. వీడియోలతో అభిమానులను అలరిస్తోంది. హాట్ యాంకర్ గా ఈ బ్యూటీ చాలా మంది ఫాన్స్ ని సంపాదించుకుంది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి, వెండి తెరపై కూడా తన అందంతో ఆకట్టుకుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసిన ఈ భామ తాజాగా క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకుంది.