MoviesTollywood news in telugu

రూట్ మార్చిన శ్రీకాంత్…సక్సెస్ అయ్యేనా…?

Tollywood Hero Srikanth : గతంలో అక్కినేని నాగచైతన్య నటించిన యుద్ధం శరణం సినిమాలో విలన్‌గా నటించిన శ్రీకాంత్ మరోసారి విలన్ అవతారమెత్తాడు. నిజానికి క్యారెక్టర్ యాక్టర్ గా, విలన్ గా నటిస్తూ హీరోగా మారిన శ్రీకాంత్ ప్రస్తుత పరిణామాల్లో విలన్ పాత్రకు సై అంటున్నాడు. ఇతడే కాదు, ఒకప్పుడు హీరోగా రాణించిన జగపతి బాబుతో సహా చాలామంది ఇప్పుడు విలన్స్‌గా మారుతూ సక్సెస్ అందుకుంటున్నారు.

జనంలో విలనిజానికి క్రేజ్ ఉండడంతో రానా కూడా నటించాడు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా కోసం శ్రీకాంత్ భయంకర విలన్ గా కనిపించబోతున్నాడు. దీంతో శ్రీకాంత్ కెరీర్ కొత్త పుంతలు తొక్కుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బాలయ్య నటించిన లెజెండ్ సినిమాతో విలన్‌గా జగపతి బాబు ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు.

ఆ సినిమా తరువాత జగపతిబాబు కెరీర్ మారిపోయింది. విలన్‌గా ఫుల్ బిజీ అయ్యాడు. తెలుగుతోపాటు తమిళ్ సినిమాల్లోనూ విలన్‌గా నటించి మెప్పిస్తున్నారు. ఇప్పుడు హీరో శ్రీకాంత్ అదే బాటలో బాలయ్య కోసమే అఖండ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కు ఒకే చెప్పేసాడు. దీంతో శ్రీకాంత్ ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అవుతాడని టాక్ నడుస్తోంది.