టమాటాలను తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయా…దీనిలో నిజం ఎంత…?
Tomatoes and kidney stones in telugu : మనం టమాటాలను ఎక్కువగా వాడుతూ ఉంటాం. టమాటాలు ఎక్కువగా అనేక రకాల వంటకాలలో కలిపి వాడుతూ ఉంటాం. వంటలకు మంచి రుచి వస్తుంది. అలాగే టమాటో పప్పు, మసాలా కూరలు వంటివి చేసుకుంటూ ఉంటాం. టమోటాలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి.
అయితే మనలో చాలా మందికి ఒక సందేహం ఉంది. టమాటా ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అని చాలా మంది తినటానికి ఆసక్తి చూపరు. దీనిలో నిజమెంత అనేది తెలుసుకుందాం.కిడ్నీలో రాళ్లు అనేవి ఏర్పడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. కిడ్నీల్లో జరిగే ప్రెసిపిటేషన్ అనే ప్రక్రియ కారణంగా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి.
మనం తీసుకొనే ఆహారంలో ఉండే మినరల్స్, ఆగ్జలేట్స్, కాల్షియంలు కిడ్నీల్లోని యూరిక్ యాసిడ్‌తో కలిసి కిడ్నీల్లో రాళ్లుగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. చిన్న చిన్న స్పటికాలుగా తయారయ్యి ఆ తర్వాత పెద్ద రాళ్లుగా మారతాయి. అలాంటి సమయంలోనే రాళ్లు మూత్రాశయానికి అడ్డుపడి మూత్రం రాకుండా చేస్తాయి. దాంతో విపరీతమైన బాధ, నొప్పి వస్తాయి.
టమాటాలు తినటం వలన కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడతాయా అనే విషయానికి వచ్చేసరికి టమోటానే కాకుండా ఆగ్జలేట్లు, కాల్షియం ఎక్కువగా ఉన్న వాటిని తీసుకుంటే కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడతాయి. కిడ్నీల్లో రాళ్ళ సమస్య ఉన్నవారు టమోటా వంటి ఆగ్జలేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోకూడదు. కిడ్నీల్లో రాళ్ళ సమస్య లేనివారు ఎటువంటి అనుమానం లేకుండా టమోటా తినవచ్చు.