Healthhealth tips in telugu

వేడి నీటిలో అల్లం రసం కలిపి తాగుతున్నారా…ఈ నిజాలు తెలుసుకోండి

Ginger health Benefits in telugu :ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవలసిన అవసరం ఉంది.అలాగే సీజన్ మారినప్పుడు వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పించుకోవలసిన అవసరం కూడా ఉంది. దీని కోసం మన వంటింటిలో ఉండే అల్లం చాలా బాగా సహాయపడుతుంది. అల్లంను ఎలా ఎప్పుడు తీసుకోవాలో చూద్దాం.

ఈ మధ్య కాలంలో చాలా మంది వేడినీటిలో అల్లం రసం కలిపి త్రాగుతున్నారు. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాక కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ప్రతి రోజు అల్లం రసం త్రాగితే రక్తపోటు,మధుమేహం కంట్రోల్ లో ఉంటాయి.

అలాగే గొంతు నొప్పి,దగ్గు వంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది. అల్లంను తొక్క తీసి వాడాలి. చాలా మంది అల్లంను తొక్క తీయకుండా వాడేస్తూ ఉంటారు. ఆలా వాడకూడదు. అల్లం తొక్కలో విష పదార్ధాలు ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా అల్లం తొక్కక తీసి వాడటం అలవాటు చేసుకోవాలి.

అల్లం రసంలో ఎక్కువ శాతంలో విటమిన్ సి, మెగ్నీషియం ఇలా శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దగ్గు, జలుబు, గొంతునొప్పి నుండి మంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం రసం కలుపుకొని తాగండి.