ఇప్పటి వరకు ఈటీవీ లో రాత్రి 9.30 కు ప్రసారమైన డైలీ సీరియల్స్…మీరు చూసారా
Ee Tv Serials In Telugu : అప్పట్లో ఈటీవీలో రాత్రి 9న్నర అయితే చాలు సినిమా వచ్చేది. జనం కూడా బాగానే చూసేవారు. అలాంటి సమయంలో సినిమా టైం 10గంటలకు మార్చేసి, 9న్నరకు సీరియల్స్ ప్రసారం చేయడం స్టార్ట్ చేసారు. మొదటిగా ఈ స్లాట్ లో 1999లో సంఘర్షణ సీరియల్ స్టార్ట్ అయింది. జాకీ, హరిత, ఉదయభాను, చిన్నా తదితరులు నటించారు.
తర్వాత 2001లో చదరంగం సీరియల్ ప్రసారం అయింది. హరిత, రాజీవ్ కనకాల, జ్యోతిరెడ్డి, ఉష తదితరులు పాల్గొన్నారు. తర్వాత దీన్ని 9గంటలకు మార్చారు. దాంతో 2001లోనే 9న్నరకు జనని సీరియల్ స్టార్ట్ అయింది. జయసుధ డాక్టర్ గా నటించగా, శరత్ బాబు తదితరులు నటించారు. ఈ సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ రాత్రి పదిన్నరకు మార్చారు.
తర్వాత 2002లో 9న్నరకు మాతృదేవత స్టార్ట్ చేసారు. శారద మెయిన్ రోల్ చేసింది. తర్వాత రాత్రి 7న్నరకు ప్రసారమయ్యే మనోయజ్ఞం సీరియల్ ని 9న్నరకు మార్చారు. 2003లో ఇల్లాలు సీరియల్ 9న్నరకు ప్రసారమయ్యేది. భానుచందర్, మంజుల, రవికుమార్, భావన తదితరులు ఇందులో నటించారు.
తర్వాత 2003నుంచి నా మొగుడు నాకు సొంతం సీరియల్ రాత్రి 9న్నరకు ప్రసారం చేసారు. సమీర్, భావన, స్వాతి, జాకీ తదితరులు నటించారు. 2004లో సంతోషం సీరియల్ స్టార్ట్ అయింది. నాగబాబు, నరసింహరాజు, శృతి తదితరులు నటించారు. 2005లో కురుక్షేత్రం సీరియల్ స్టార్ట్ అయింది. వర్ష, మల్లిక, నవీన్, తదితరులు నటించారు.
2006లో ప్రభాకర్ హోస్ట్ గా యాహూ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. 2007లో సంధ్యారాగం సీరియల్ స్టార్ట్ చేసారు. 2008లో యాహూ సీజన్ 2 స్టార్ట్ అయింది. ఇక అక్కడ నుంచి పాడుతా తీయగా, జబర్దస్త్, వంటి షోస్ తో ఈటివి 9న్నర స్లాట్ నడుస్తోంది.