Healthhealth tips in telugu

నరాల బలహీనత,నరాలలో అడ్డంకులు,నరాల్లో నొప్పి,మైకం,డయబెటిస్,గుండె సమస్యలు జీవితంలో ఉండవు

Nerve Weaknees Home Remedies In Telugu : మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. రక్తాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళటానికి సహాయపడతాయి. ఇవి బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి ఈ నరాలు బలహీనంగా మారుతూ ఉంటాయి. ఇలా నరాలు బలహీనంగా మారినప్పుడు అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి. నరాల్లో అడ్డంకులు ఉన్న నొప్పి ఉన్న బలహీనం అవుతాయి.

నరాల బలహీనత ఉన్నప్పుడు నరాలలో అడ్డంకులు ఉన్నప్పుడు ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ కారణంగా నరాలు బలహీన పడతాయి అధిక రక్తపోటు, నరాల లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా నరాలు బలహీనపడతాయి. కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా నరాలు బలహీనం అవుతూ ఉంటాయి. అధిక మద్యపానం, అధిక ధూమపానం వల్ల కూడా నరాలు బలహీనపడతాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా నరాలు బలహీనపడతాయి.

ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇతి చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇటువంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. అలాగే సమస్య పెద్దగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా పాటిస్తూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది. నరాల బలహీనత తగ్గటానికి ఒక డ్రింక్ తెలుసుకుందాం.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక నల్ల యాలకలు, 3 లేదా 4 లవంగాలు, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 5 నుంచి7 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తాగి ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల 15 రోజుల పాటు తాగాలి.