MoviesTollywood news in telugu

శివ కార్తికేయన్ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Tamil Hero sivakarthikeyan remuneration : తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా ‘వరుణ్ డాక్టర్’ అనే మూవీ తో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో అయలాన్, డాన్ సినిమాల్లో చేస్తున్నాడు. యితడు అటు తమిళంలో, ఇటు తెలుగులో కూడా ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే అతడు నటించిన పలు మూవీస్ సూపర్ హిట్ అవ్వడంతో అవి తెలుగులో డబ్బింగ్ చేసారు. ఇక్కడ కూడా హిట్టయ్యాయి.

నిజానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన శివ.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరో అయ్యాడు. రెమో మూవీ తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా శివ కార్తికేయన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపో యింది. తాజాగా వచ్చిన’వరుణ్ డాక్టర్’ అనే మూవీ మూవీ భారీ బడ్జెట్ చిత్రాలు ధీటుగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో శివ కార్తికేయన్ క్రేజ్ పెరగడంతో రెమ్యునరేషన్ అమాంతం పెరిగిందట.

దాంతో తమిళ్ ఇండస్ట్రీ మొత్తం ఈ యంగ్ హీరో రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ ఒక్క సినిమాకు 27 కోట్ల రూపాయల నుంచి 35 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నాడని టాక్. ఇక తెలుగులో తొలిసారిగా కౌస‌ల్య కృష్ణ‌మూర్తి చిత్రంతో వెండితెరపై కనిపించిన శివ‌ త్వ‌ర‌లో స్ట్రెయిట్ తెలుగు సినిమా కు రెడీ అవుతున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వచ్చాయి. మొత్తానికి హీరోగా మారిన స్వల్ప సమయంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.