ఈ చిన్నారి సౌత్‌లో క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
Tollywood actress nazriya nazim : మలయాళం లో స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నజ్రియా నజీమ్ సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా నిల్చింది. తమిళ్, మలయాళ సినిమాల్లో చేసిన ఈ భామ రాజా రాణి డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. దాంతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు సినిమాలో నేరుగా నటించడానికి రెడీ అయింది.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అంటే సుందరానికి అనే సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తోంది. డబ్బింగ్ మూవీ రాజా రాణి తోనే ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ తెలుగులో డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో వరుస ఆఫర్లు వస్తాయని టాక్.
ఇక నజ్రియా నజీమ్ భర్త ఫహద్ ఫాజిల్ కూడా ఇప్పుడు తెలుగులో నటిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. మొత్తానికి భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి తెలుగులో నేరుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదే సమయంలో నజ్రియా నజీమ్ చిన్నప్పటి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.