Healthhealth tips in telugu

భోజనం అయ్యాక 3 ముక్కలు చప్పరిస్తే లివర్ క్లీన్ అవ్వటమే కాకుండా ఊహించని ప్రయోజనాలు…అసలు నమ్మలేరు

Amla Health benefits In telugu : ఉసిరిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన పండ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. అనేక వ్యాధులను నయం చేయడానికి ఉసిరిని వాడుతుంటారు. ప్రస్తుతం ఈ సీజన్ లో ఉసిరి విరివిగా లభ్యం అవుతుంది. ఉసిరిని సంవత్సరం మొత్తం వాడాలంటే ఉసిరిని ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు.

ఉసిరి కాలేయానికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాలేయంలో విషాలు బయటకు పంపి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేసి కాలేయ విధులు సక్రమంగా జరిగేలా చేస్తుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.

ఉసిరిలో పాలీఫెనాల్స్, విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. అంతేకాదు.. ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా రక్షిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ జరగటానికి సహాయపడుతుంది.

ఉసిరిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం, హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో ఉండే చెడు పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఉసిరి కాయలను తినడం వల్ల టాక్సిన్ స్థాయిలను తగ్గించవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఉసిరిలో ఉండే పాలీఫెనాల్‌లు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితుల నుండి రక్షిస్తుంది. ఉసిరి.. శరీరాన్ని ఇన్సులిన్ వైపు మరింత రియాక్టివ్‌గా చేస్తుంది. ఇన్సులిన్ శోషణను పెంచుతుంది. డయబెటిస్ ఉన్నవారిలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు ఏమి ఉండవు. ఉసిరిలో ఉండే విటమిన్ సి, టానిన్లు, అమైనో ఆమ్లాలు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు జుట్టు రాలకుండా ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.