తెలుగుతో పాటు ఇతర బాషల్లో దుమ్ము రేపుతున్న హీరోయిన్స్
Tollywood star heroines : టాలీవుడ్ లో దుమ్మురేపుతున్న హీరోయిన్స్ ఇతర భాషా చిత్రాల్లో కూడా నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా సౌత్ లో సత్తా చాటుతున్న నయనతార లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటోంది. తాజాగా హిందీలో షారుఖ్ సరసన చేయడానికి రెడీ అవుతోంది.
గీత గోవిందం మూవీతో భారీ హిట్ అందుకున్న రష్మిక మందన తర్వాత సరిలేరు నీకెవ్వరూ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. భీష్మ మూవీతో మరో హిట్ కొట్టింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో కల్సి పుష్ప మూవీలో చేస్తోంది. కన్నడలో కూడా పాపులార్టీ తెచ్చుకున్న ఈ భామ ఇక బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చూపాలని చూస్తోంది.
తెలుగు, హిందీ భాషల్లో నటించిన పాయల్ హెడ్ తాజాగా బుష్ అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ ఇప్పటికే హిందీ, పంజాబీ భాషల్లో సత్తా చాటింది. తాజాగా కన్నడ మూవీలో చేయడానికి రెడీ అయింది.
ఉప్పెన మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ సరసన నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న కృతిశెట్టిని వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. మాచర్ల నియోజక వర్గం, శ్యాం సింగరాయ, బంగార్రాజు మూవీస్ చేస్తోంది. ఇందులో శ్యాం సింగరాయ, బంగార్రాజు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అలాగే రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా కృతి నటిస్తోంది.