ఫొటోలోని ఈ క్యూటీ ఇప్పుడు క్రేజీ హీరోయిన్…ఎవరో గుర్తు పట్టారా…?
Tollywood actress sai pallavi :ఫిదా మూవీతో మొత్తం తెలుగు రాష్ట్రాల వాళ్లందరినీ ఫిదా చేసిన సాయిపల్లవి ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుని దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. మలయాళీ భామ అయినప్పటికీ అచ్చం పక్కింటి తెలుగు అమ్మాయిలా తన నటనతో చెరగని ముద్రవేసుకుంది.
ఇటీవలే మరో సారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాతో పాటు తమిళంలో కూడా ఓ సినిమా చేస్తోంది. తాజాగా సాయి పల్లవి క్యూట్ లుక్స్ తో చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను ఫాన్స్ షేర్ చేస్తున్నారు.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత గల సినిమాలే చేస్తున్న ఈ భామ సహజమైన అందంతో,సహజమైన నటనతో ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటుంది. హీరోలకు సరి సమానంగా డాన్స్ లతో అదరగొట్టేస్తోంది ఈ రౌడీ బేబీ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తోంది.