విక్రమార్కుడు సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?
Vikramarkudu Movie : ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మాస్ మహారాజ్ రవితేజ ఫాన్స్ కి ఒక ఊపు తెచ్చిన సినిమా ఇది. రవితేజ లోని నటుడిని బయటకు తీసిన ఈ సినిమాలో యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అన్నీ సూపర్. రవితేజ డబుల్ రోల్ చేసిన ఈ మూవీలో అనుష్క జోడీ కట్టింది.
బ్రహ్మానందం కామెడీ, చిన్నపిల్ల తల్లి సెంటిమెంట్, రవితేజ – అనుష్క నడుమ లవ్ ట్రాక్ .. వెరసి ఈ సినిమా యాక్షన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మూవీగా 2006జూన్ 23న రిలీజై, అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక జూన్ 16న భరత్, మల్లికా కపూర్ జంటగా నటించిన మహా మూవీ రిలీజయింది. విజయ్ మెల్టన్ డైరెక్ట్ చేసిన ఈ తమిళ డబ్బింగ్ మూవీ తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. జూన్ 30న మంచు విష్ణు నటించిన అస్త్రం మూవీ రిలీజయింది. అనుష్క హీరోయిన్ గా చేసిన ఈ మూవీ పరాజయం పాలైంది.
అదేరోజు సమ్ థింగ్ స్పెషల్ మూవీ రిలీజయింది. సామ్రాట్, సునయన ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ కూడా నిరాశ పరిచింది. ఇక నందనవనం 120 కిలోమీటర్లు మూవీ కూడా జూన్ 30నే వచ్చింది. డైరెక్టర్ నీలకంఠ తెరకెక్కించిన ఈ మూవీ హిట్ అయింది. అదేరోజు అమృతధార మూవీ రిలీజయింది.