తన గాత్రంతో అలరిస్తున్న ఈ సింగర్ ని గుర్తు పట్టారా…అయితే చూడండి
Tollywood singer ramya behara : ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు మాత్రం టాలీవుడ్ లో సింగర్స్ కొరత ఏమాత్రం లేదు. దీనికి ముఖ్య కారణం దివంగత గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని చెప్పక తప్పదు. పాడుతా తీయగా ప్రొగ్రాం ద్వారా చాలామంది సింగర్స్ ని టాలీవుడ్ లో రాణించేలా బాలు చేసారు.
అందులో అద్భుతమైన గాత్రంతో పాటు ఆకట్టుకునే అందం గల సింగర్ రమ్య బెహరా యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇక సూపర్ సింగర్ 4లో పాల్గొన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టడంతో గుర్తుపట్టలేక పోతున్నారు. యూత్ సింగర్ రమ్య బెహరా ప్రస్తుతం కన్నడ, తమిళ్, హిందీ సినిమాలలో కూడా పాడుతున్నప్పటికీ టాలీవుడ్ టాప్ సింగర్లలో ఒకరిగా ఉంది.
ఈమె గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1994 ఫిబ్రవరి 1 జన్మించింది. అయితే హైదరాబాద్‌లో పెరిగింది. ఈమెకు ఇద్దరు అక్కలు ఉన్నారు. రామాచారి దగ్గర సంగీతం నేర్చుకున్న రమ్య బెహరా వివిధ పాటల పోటీల్లో పాల్గొని మంచి పేరు సంపాదించుకుంది. టీవీ ప్రొగ్రామ్స్‌లో సైతం అదరగొట్టింది. దేశ, విదేశీ సంగీత కచేరిల్లో పాల్గొని, శ్రోతలను అలరించింది.
టాలీవుడ్ మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మెప్పు పొంది.. అయన ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. వెంగమాంబ సినిమాతో ఆమె పాటల ప్రయాణం ప్రారంభమైంది. ఆపై లచ్చిందేవికి ఓ లెక్కుంది, కృష్ణాష్టమి, బ్రూస్ లీ, బాహుబలి ది బిగినింగ్, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, కొత్తజంట, చిన్నదాన నీకోసం, దిక్కులు చూడకు రామయ్య, ఇస్మార్ట్ శంకర్, రెడ్, రంగ్ దే, శతమానం భవతి సినిమాలలో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించింది.