పుస్తకం మాటున దాగున్న ఈ నటి ఎవరో గుర్తు పట్టారా..?
Tollywood Anchor Anasuya :విస్తృతంగా సోషల్ మీడియా పెరిగిపోవడంతో ఇదే వేదికగా సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు, తమ చిన్న నాటి ఫోటోలను షేర్ చేస్తూ,‘గుర్తుపట్టండి.. అని ఫ్యాన్స్‌కు సవాల్ విసురుతున్నారు. తాజాగా యాంకర్ అనసూయ కూడా తన లేటెస్ట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
అనసూయ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్ప మూవీలో ద్రాక్షాయని అనే పాత్రలో నటిస్తోంది. ఇటీవలే చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో చూస్తే, అనసూయ లైబ్రరీలో నిలబడి ఓ పుస్తకాన్ని మొహానికి అడ్డుగా పెట్టుకొని సీరియస్‌గా చదువుతూ ఉంది.
అయితే తన మొహాన్ని మాత్రం కనిపించకుండా చేసింది. అంతేకాదు, ఇక ఈ ఫోటోతో పాటు.. పాలో కొయెల్హో రచయిత రాసిన.. ‘పుస్తకం అనేది పాఠకుల మదిలో నడిచే సినిమాలాంటిది’ అనే క్యాప్షన్ కూడా జతచేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్ చక్కర్లు కొడుతోంది. దాంతో ఫాన్స్ ఈ ఫోటోపై లైక్‌ల మీద లైక్ లు ఇస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో తో ఆకట్టుకున్న ఈ భామ ఓపక్క బుల్లితెర, మరోపక్క వెండితెరపై సత్తా చూపిస్తోంది.