“జగదేక వీరుడు అతిలోక సుందరి” సినిమాకు చిరంజీవి,శ్రీదేవిలకు పారితోషికం ఎంతో తెలుసా?
jagadeka veerudu atiloka sundari movie : దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీకి 35లక్షల లాభం వచ్చింది. అప్పటి బాల్కనీ టికెట్ ధర 6రూపాయలను, ఇప్పటి ధరతో పోలిస్తే కోట్లలో కలెక్షన్స్ ఉంటాయి.
ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. ఇప్పటికీ ఈ సినిమాకు గల క్రేజ్ వేరే చెప్పక్కర్లేదు. అప్పట్లో రాఘవేంద్రరావు, జంధ్యాల కల్సి స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ మూవీకి ఇళయరాజా బాణీలు అందించారు. వైజయంతి మూవీస్ పతాకంపై ఎన్నో హిట్ మూవీస్ తీసిన అశ్వినీదత్ నిర్మించిన మూవీ ఇది. చిరంజీవి కెరీర్ లో కమర్షియల్, అండ్ క్లాసిక్ మూవీ ఇది.
అందుకే ఇదే సినిమాను యంగ్ హీరోతో మళ్ళీ తెరకెక్కించాలన్న చర్చలు కూడా ఆ మధ్య నడిచాయి. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలో నటించినందుకు శ్రీదేవి అప్పట్లో 25లక్షలు అందుకుంది. సినిమా పేరుకి తగ్గట్టు అతిలోక సుందరిలానే ఉంది. అయితే చిరంజీవికి 35లక్షలు ఇచ్చారు. ఇక