7 రోజులు..కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నిద్రలేమి,చెడు కొలెస్ట్రాల్,గుండె సమస్యలు జీవితంలోఉండవు
Joint Pains Home REmedies in telugu : ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులు కారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సమస్య రాగానే మందుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉంటే అప్పుడు డాక్టర్ సలహా పాటిస్తూ ఇప్పుడు చెప్పే .రెమిడీ ఫాలో అయితే సరిపోతుంది.
ఇప్పుడు చెప్పే ఈ పాలను 7 రోజుల పాటు తాగితే వందేళ్లు అయినా నరాల బలహీనత, కంటి బలహీనత, కాల్షియం లోపం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, రక్తహీనత, అధిక బరువు సమస్యలు ఏమీ ఉండవు. ఈ రెమిడీ కోసం కేవలం మనం మూడే మూడు ఇంగ్రీడెంట్స్ వాడుతున్నాం.
శరీరంలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటే వ్యాధులపై పోరాడే శక్తి బాగా పెరుగుతుంది మన శరీరం అనేక వ్యాధుల నుంచి రక్షించబడుతుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది . ఇప్పుడు చెప్పే ఈ పాలను ఉదయం తాగితే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు.
రాత్రి సమయంలో 5 డ్రై నల్ల ద్రాక్ష, 3 వాల్ నట్స్ లను ఒక బౌల్ లో వేసి నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన వాల్ నట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కొంచెం వేడెక్కాక ముక్కలుగా కట్ చేసుకున్న వాల్ నట్స్ వేయాలి.
ఆ తర్వాత డ్రై నల్ల ద్రాక్ష వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన తర్వాత కొంచెం బెల్లం వేసి ఒక నిమిషం అయ్యాక పొయ్యి ఆఫ్ చేసి ఆ పాలను గ్లాస్ లో పోసి తాగాలి. ఈ విధంగా వారం రోజుల పాటు తాగాలి. ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల మరో వారం రోజుల పాటు తాగాలి. ఈ విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ పాలను ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తాగవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా ఇటువంటి పాలను తాగవలసిన అవసరం ఉంది.