“మిఠాయి కొట్టు చిట్టెమ్మ” సీరియల్ లో నటిస్తున్న అంజనా గురించి ఈ విషయాలు తెలుసా ?
Mithai Kottu Chittemma Serial Anjana Srinivas : కన్నడ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజనా శ్రీనివాస్ కి ఒక చేదు అనుభవం ఎదురైంది. 2014లో గోరంత దీపం సీరియల్ లో పద్మావతి పాత్ర చేసి పలువురి మన్ననలను అందుకుంది.
అయితే కన్నడ సీరియల్ లో ఏకంగా రెండేళ్లు నటించినప్పటికీ సెట్ లో అందరూ విసుక్కునేవారట. ఒక్కరు కూడా మెచ్చుకోలేదట. ఇటీవల ఓ ఇంటర్యూలో ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. 2012లో కృష్ణా రుక్మిణి సీరియల్ లో నటిగా ఎంట్రీ ఇచ్చి రెండేళ్లకు అగ్రిమెంట్ అయింది.
ఆ సీరియల్ సూపర్ హిట్ కావడంతో 2014లో తెలుగులో ఛాన్స్ వచ్చింది. భాష సమస్య వలన మొదట్లో కొంత ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెల్పింది. మొత్తానికి గోరంత దీపం సీరియల్ లో మంచి పేరు వచ్చిందని అంజనా చెప్పింది. తల్లి టీచర్, తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తాను కూడా ఉద్యోగం వైపే మొగ్గు చూపించానని, అయితే ఒకసారి కాలేజీ ఈవెంట్ లో డాన్స్ సందర్బంగా మేకప్ వేసుకోవడంతో, మేకప్ వేసిన మేకప్ మెన్ ప్రోద్భలంతో నటిగా మారాల్సి వచ్చిందని, ఎందుకంటే సీరియల్స్ లో నటిస్తావా అని అడగడంతో ఆటోమేటిక్ గా ఒకే చెప్పేసానని అంజనా చెప్పుకొచ్చింది.