Healthhealth tips in telugu

వాము నీటిని 3 రోజులు తాగితే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?

ajwain Water Health benefits in telugu :మన వంటింట్లో ఉండే వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన పూర్వీకులు ఆరోగ్య ప్రయోజనాల కోసం వామును ఎక్కువగా ఉపయోగించేవారు. అలాగే ఆయుర్వేదం లో కూడా ఎక్కువగా వాముని వాడుతూ ఉంటారు. వాము నీటిని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం.
ajwain seeds and kidney stones
ముందుగా వాము నీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాము ఒక స్పూన్ తీసుకుని దోరగా వేగించి ఒక గ్లాసులో వేసి దానిలో నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి మరుసటి రోజు ఆ నీటిని మరిగించి వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఈ విధంగా తాగటం వలన గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి

బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది దాంతో బరువు తగ్గుతారు. వాములో ఉండే థైమోల్ కడుపులో గ్యాస్ట్రిక్ రసాలను ఉత్పత్తి చేసి జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. గర్భదరణ సమయంలో వచ్చే మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది.

దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి వాటిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక అరస్పూన్ వాము, 4 తులసి ఆకులను వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.