ఒక గ్లాస్ – రక్తహీనత, గుండె దడ, భయం, ఆందోళన,కొలస్ట్రాల్,గుండె సమస్యలు జీవితంలో రావు
Home Remedies For Anemia In Telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఎదో ఒక అనారోగ్య సమస్య అనేది వస్తుంది. సమస్య చిన్నగా ఉన్నా లేదా ప్రారంభ దశలో ఉన్నా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అదే సమస్య పెద్దగా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిందే. కొంతమంది చిన్న విషయానికే ఆందోళన పడిపోతూ ఉంటారు.
ఈ రోజు గుండెకు సంబందించిన సమస్యలు గుండె దడ, కొలస్ట్రాల్, భయం, ఆందోళన తగ్గటానికి ఒక డ్రింక్ తయారుచేసుకుందాం. ఈ డ్రింక్ తయారుచేసుకోవడం చాలా సులువు.కేవలం రెండే రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. అవి కొత్తిమీర, కిస్ మిస్. ఈ రెండు దాదాపుగా అందరికీ అందుబాటులో ఉండేవే. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి గుప్పెడు కొత్తిమీర ఆకులను, 5 కిస్ మిస్ లను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన నీటిని వడకట్టి తాగాలి. ఈ విధంగా పది రోజుల పాటు తాగితే మంచి ఫలితం వస్తుంది. కిస్ మిస్ లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్త హీనత సమస్య ఉంటె అలసట,బలహీనత ఏర్పడుతుంది. కిస్ మిస్ లో ఉండే ఐరన్ ఈ సమస్యలను తగ్గిస్తుంది. అధిక రక్తపోటు లక్షణాలను తగ్గిస్తుంది. దాంతో రక్తప్రసరణ బాగా జరిగి గుండె సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది . కొలస్ట్రాల్ ని తగ్గిస్తాయి.
కొత్తిమీరలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటిఆక్సిడంట్ల వలె పనిచేస్తాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి. చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. కొత్తిమీరలో కాల్షియం అధికంగా ఉంటుంది. కొత్తిమీర రక్తపోటు స్థాయిలను తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది.