కోల్ కత్తా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?
Kolkata backdrop Telugu movies : గోదావరి నేపధ్యం, విదేశాల నేపధ్యం, కాశ్మీర్ నేపధ్యం, పర్యాటక చారిత్రక ప్రదేశాల నేపధ్యం గల సినిమాలు చాలా వస్తుంటాయి. ఇందులో పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తా నేపథ్యంతో కూడా చాలా సినిమాలు వచ్చాయి. నాని హీరోగా దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తున్న శ్యామ్ సింగ రాయ్ విడుదలకు సిద్ధంగా ఉంది.
మెగాస్టార్ చిరంజేవి హీరోగా నటించిన 1998 లో గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన చూడాలని ఉంది మూవీ అక్కడే తెరకెక్కింది. 2001లో ఎస్జే సూర్య డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ మూవీ కూడా కోల్ కత్తా బ్యాక్ గ్రౌండ్ లోనే తీశారు. మణిరత్నం తీసిన హీరో సూర్య నటించిన యువ మూవీ కూడా అక్కడే తీశారు. ఇది 2004లో వచ్చింది.
వెంకటేష్ హీరోగా దర్శకుడు వివి వినాయక్ 2006లో తెరకెక్కించిన లక్ష్మీ మూవీ కూడా ఇక్కడే తీశారు. దర్శకుడు కరుణాకరణ్, 2008లో యశో సాగర్ హీరోగా తెరకెక్కించిన ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా అక్కడే తీశారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 2010లో వివి వినాయక్ డైరెక్ట్ చేసిన అదుర్స్, 2011లో పవన్ కళ్యాణ్ హీరోగా 2011లో విష్ణువర్ధన్ డైరెక్ట్ చేసిన పంజా మూవీ, 2013లో రామ్ చరణ్ హీరోగా వినాయక్ తెరకెక్కించిన నాయక్, 2014లో రవితేజ హీరోగా బాబీ డైరెక్షన్ లో వచ్చిన పవర్, చిరంజీవి హీరోగా 2017లో వివి వానాయక్ డైరెక్ట్ చేసిన ఖైదీ నెంబర్ 150, శర్వానంద్ హీరోగా 2018లో హను రాఘవపూడి తెరకెక్కించిన పడిపడి లేచే మనసు మూవీస్ లో కోల్ కత్తా నేపధ్యం కన్పిస్తుంది.