MoviesTollywood news in telugu

ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ హీరోని గుర్తు పట్టారా…ఎవరో…?

Telugu actor varun sandesh : ఒక దశలో టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్‌గా వరస ఆఫర్లతో దూసుకెళ్లిన యంగ్ హీరో వరుణ్ చిన్నప్పటి ఫోటో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సో క్యూట్ అంటూ పలువురు ఫాన్స్ , నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి చిన్నప్పటి వరుణ్ ఫోటోని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి మనవడైన వరుణ్ ప్రస్తుతం నటి వితికా షేరును పెళ్ళిచేసుకుని హ్యాపీ లైఫ్ గడుపుతున్నాడు.

ఆలోచనాత్మక చిత్రాలు తీసే డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత నటించిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సోలో హీరోగా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. కానీ తర్వాత వరుస డిజాస్టర్స్ వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత చేసిన ఏమైంది ఈవేళ … మూవీ కాస్తంత పర్వాలేదనిపించింది.

ఇక 2015 తర్వాత మళ్ళీ స్లో గా మారిపోయిన వరుణ్ సందేశ్ కేవలం ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వస్తున్నాడు. తాజాగా నూతన దర్శకుడు శ్రీనివాస రవీంద్ర తెరకెక్కిస్తున్న ఇందువదన మూవీ లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబో తున్నాడు. అయితే ఈ మూవీ టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వస్తానన్న నమ్మకంతో ఉన్నాడు.