3 సార్లు – దగ్గు,జలుబు, గొంతు నొప్పి,ఛాతిలో కఫము నిమిషాల్లో మాయం…జన్మలో రాదు
Home Remedies for Cough and Cold In Telugu : ఏ కాలంలోనైనా వాతావరణం మారగానే… చాలా మందికి వ్యాపించే అనారోగ్య సమస్యల్లో దగ్గు, జలుబు కామన్. వాటిని లైట్ తీసుకుంటే చాలా రోగాలకు దారితీస్తాయి. అందుకే వాటిని వెంటనే తగ్గించుకొనే మార్గాలు గురించి ఆలోచించాలి. దగ్గు,జలుబు వచ్చాయంటే ఒక పట్టాన వదలవు. ఇవి లేకపోతె చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఫిల్ అవుతాం.
గొంతులో తేడాగా ఉన్నా ముక్కులో గడబిడ ఉన్నా చాలా చిరాకుగాను నిసత్తుగాను ఉంటుంది. దగ్గు,జలుబు తగ్గేదాకా ప్రశాంతత ఉండదు. ఇవి శరీరంలో సమస్యలకు కారణం అవుతాయి. దగ్గు,జలుబుతో పాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇలా ఒక్కొకటి వచ్చేస్తూ ఉంటాయి.కాబట్టి… దగ్గు, జలుబు రాగానే మనం అలర్ట్ అవ్వాలి.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో చిన్న అల్లం ముక్క, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క లేదా దాల్చినచెక్క పొడి వేసి 6 నుంచి 7 నిమిషాల పాటు సిమ్ లో మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి దానిలో అరస్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
ఈ విధంగా ఉదయం, సాయంత్రం తాగితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అల్లం,లవంగాలు,దాల్చినచెక్క,తేనెలలో రోగనిరోదక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. దగ్గు ఉన్నప్పుడూ 3 రోజులు తాగితే సరిపోతుంది. ఈ డ్రింక్ ని ఈ సీజన్ లో కూడా రెండు రోజులకు ఒకసారి తాగితే ఇమ్మునిటీ పవర్ పెరుగుతుంది.