భీమ్లా నాయక్ అడవి తల్లి పాట పాడిన దుర్గవ్వ గురించి తెలుసా…?
Bheemla nayak song adavi thalli- : త్రివిక్రమ్ శ్రీనివాస్, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న పవర్ స్టార్ పవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్ ని సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తీస్తున్న ఈ మూవీలో రానా దగ్గుబాటి కీలక పాత్ర చేస్తున్నాడు.
ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్,పాటలు అన్నీ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.
దానికి తోడు తాజాగా విడుదైన అడవి తల్లి మాట సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, అంచనాలను మరింత పెంచేసింది. ఈ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
Folk సింగర్ కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి కలిసి ఈ సాంగ్ ఆలపించారు. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో అడివి తల్లి మాట పాట పాడిన Folk సింగర్ దుర్గవ్వ గురించి నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈమె ఏం చదువుకోలేదు. పొలం పనులకు వెళ్లినప్పుడు జానపదాలను పాడుతూ ఉండేది.
అలా తెలుగులోనే కాకుండా మరాఠీలోనూ అనేక పాటలు పడింది. తెలుగులో దుర్గవ్వ పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండ్ అవుతుంది. అలాగే సిరిసిల్లా చిన్నది లాంటి పాపులర్ సాంగ్స్ పాడింది. భీమ్లా నాయక్ సినిమాలో దుర్గవ్వ పాడిన అడవి తల్లి మాట పాట ప్రేక్షకులను బాగా రీచ్ అయింది. పవన్ సరసన నిత్యా మీనన్ జోడి కట్టింది.