ఒకే ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా…?
pelli sandadi heroine sreeleela : సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ చాలు టాలెంట్ ఏంటో చూపించి, వరుస ఆఫర్స్ కొట్టేయడానికి. అదృష్టం కల్సి వస్తే ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. అలా మారిన ఓ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. చారడేసి కళ్ళతో అక్కట్టుకుంటున్న ఈ పాప ఎవరా ఆరా తీస్తే అసలు విషయం తెల్సింది.
ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో కాదు, రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన సినిమాలో నటించి ఓవర్ నైట్ లో తెలుగు ప్రేక్షకులకు దగ్గర యైన శ్రీలీల. తొలి సినిమా హిట్ కావడంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. అదేనండి శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్ళిసందడి మూవీ హీరోయిన్ శ్రీలీల.
శ్రీలీల ఇప్పటికే పలు కన్నడ సినిమాల్లో నటించి, పెళ్ళిసందడి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాద్ రావ్ నక్కిన తెరకెక్కిస్తున్న ధమాకా మూవీలో ఈ భామ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు నిజానికి తెలుగమ్మాయి అయిన కర్ణాటకలో సెటిలయింది.