దగ్గు, జలుబు, జ్వరంను నిమిషాల్లో మాయం చేసే ఆకు
Tulasi health benefits in telugu : తులసి మొక్క అనేది దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. తులసిని పూజిస్తారు. అలాగే తులసి ఆకులను పూజ కోసం కూడా వినియోగిస్తాం. అంతేకాకుండా తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసిలో సుమారుగా 50 రకాలు ఉన్నా మనకు బాగా లక్ష్మి తులసి,కృష్ణ తులసి అనేవి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
తులసిలో ఎన్నో మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. తులసి ఏ రకం అయినా అన్నిన్నిటిలోను ఒకే రకమైన బెనిఫిట్స్ ఉంటాయి. వర్షకాలం వచ్చేసింది. వర్షాకాలంలో వచ్చే ఎన్నో రకాల వ్యాధులను తగ్గించటంలో తులసి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో ప్రతి భాగానికి సహాయం చేసే లక్షణాలు తులసిలో
ఉన్నాయి. ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జలుబు,దగ్గు,తలనొప్పి మరియు శ్వాస సంబంధ సమస్యల వంటివి తులసిని వాడటం ద్వారా తగ్గుతాయి.ప్రతి రోజు 3 తులసి ఆకులను నోట్లో వేసుకొని నమలవచ్చు. లేదా కషాయం తయారుచేసుకొని తాగవచ్చు.
ఒక గ్లాస్ నీటిలో 10 తులసి ఆకులను వేసి బాగా మరిగించి వడకట్టి బెల్లం లేదా తేనే కలిపి కషాయాన్ని తయారుచేసుకోవాలి. చిన్నపిల్లలకు నేరుగా తులసి ఆకులను ఇవ్వకూడదు. తులసి ఆకులను క్రష్ చేసి రసం చేసి తేనే కలిపి ఇవ్వాలి. ఈ విధంగా 3 రోజుల పాటు చేస్తే ఉపశమనం కలుగుతుంది.
ఈ విధంగా ఇవ్వటం వలన చిన్న పిల్లల్లో శ్వాస సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. తులసిలో న్యూట్రిషన్ ప్రాపర్టీస్ కన్నా ఎక్కువ మెడికల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. తులసి మొక్క గాలిని ప్యూర్ పై చేస్తుంది.