వారంలో 2 సార్లు ఈ ఆకుకూరను తీసుకుంటే ఊహించని లాభాలు…అసలు నమ్మలేరు
Menthi kura Health Benefits in telugu :ఈ చలికాలంలో ఆకుకూరలు చాలా విరివిగా లభిస్తాయి. ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఆకుకూరలను ఆహారంలో బాగంగా చేసుకోవాలి. ఈ రోజు మెంతి కూర గురించి తెలుసుకుందాం. రుచిలో కాస్త చేదుగా ఉన్న సరే ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువే.
కూరల్లో వేసిన…పప్పులా చేసిన మెంతి రుచే వేరు. ఆరోగ్యానికి మంచి చేయటంలో కూడా ముందు ఉంటుంది. వారంలో మెంతికూరను రెండు, మూడు సార్లు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మెంతికూరలో ఇనుము సమృద్దిగా ఉంటుంది. రక్తహినత సమస్య ఉన్నవారు తరచుగా తీసుకుంటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. మదుమేహం ఉన్నవారు మెంతికూరను తీసుకోవచ్చు.
ప్రతి రోజు మెంతి రసం తీసుకుంటే శరీరంలో మేలు చేసే హార్మోన్స్,ఇన్సులిన్ శాతం అదుపులోకి వస్తుంది. ఈ ఆకుకూరలో విటమిన్ కె ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం గడ్డకట్టటానికి పనికివస్తుంది. మలబద్దకం ఉన్న పిల్లలకు తరచుగా ఈ కూరను తినిపిస్తే మంచిది. ఇందులో పీచు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.
కొలస్ట్రాల్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. అందువలన బరువు తగ్గాలని అనుకునే వారు ఈ కూరను ఎంచుకోవటం చాలా మంచిది. దీనిలో ఉండే మాంసకృత్తులు చర్మానికి మేలు చేస్తాయి. జుట్టు బాగా పెరగటానికి ఉపయోగపడుతుంది. మెంతికూర ఆకులను ఎండబెట్టిన వాటిలో పోషకాలు అలానే ఉంటాయి. మెంతి కూరను ఎక్కువగా కొనుగోలు చేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు.