ద్రాక్ష తింటున్నారా… తినే ముందు ఒక్కసారి ఈ నిజాలు తెలుసుకోండి
Grapes Health benefits in Telugu : మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటి గురించి మనకు పెద్దగా తెలియక పోయిన ఆరోగ్య పరంగా మంచిదని తింటూ ఉంటాం. ఇప్పుడు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు, పోషకాల గురించి తెలుసుకుందాం. ద్రాక్ష పండ్లలో విటమిన్స్ సి, కే, బీ6, థయామిన్, రైబో ఫ్లావిన్, పొటాషియం, కాపర్, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.
రక్తంలో కొలస్ట్రాల్ ని తగ్గిస్తాయి. రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే డయబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. ద్రాక్ష పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అంతే కాక, గ్రేప్స్ లో ఉండే కొన్ని కాంపౌండ్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గించగలవు.
ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంక్రీజ్ చేయగలవు. దాంతో డయబెటిస్ ఉన్నవారికి రిస్క్ తగ్గినట్టే. కంటి సమస్యలను తగ్గించటంలో సహాయ పడుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే మాక్యులర్ డీజెనరేషన్, కాటరాక్ట్, గ్లూకోమా వంటి వాటి నుండి కంటిని కాపాడుతుంది. ద్రాక్ష పండ్లలో ఉండే కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, మెగ్నీషియం, విటమిన్ కే ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.
ద్రాక్షలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచటానికి సహాయపడతాయి. అంతేకాకుండా బ్రెయిన్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఏదైనా సరే త్వరగా నేర్చుకోగలిగే సామర్ధ్యాన్ని పెంచుతాయి. చిన్న పిల్లలకు ప్రతి రోజు పెడితే మంచిది. పెద్దవారిలో వచ్చే అల్జీమర్స్ కూడా తగ్గుతుంది.
గమనిక : ఈ ఆర్టికల్ ఒక అవగాహన కోసం మాత్రమే. ఏదైనా చిన్న సమస్య వచ్చిన డాక్టర్ సలహా తీసుకోవటం ఉత్తమం. గమనించగలరు.