15 రోజుల్లో 3 నుండి 5 కిలోల బరువు పెరగటమే కాకుండా శారీరక బలహీనత తగ్గి చురుకుదనం పెరుగుతుంది
weight gain tips telugu : కొంత మంది బరువు తక్కువగా ఉన్నామని ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరగడానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. శారీరక బలహీనత తొలగిపోతుంది. శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. అధిక బరువు సమస్య ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అలాగే బాగా సన్నగా ఉన్నా కూడా అలానే ఉంటుంది.
బలహీనంగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు శక్తి చాలా తక్కువగా ఉంటుంది. సన్నగా ఉన్నవారు ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలి. ఒక మంచి రెమిడీ తెలుసుకుందాం. ఈ రెమిడీ కోసం 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు, 10 నల్ల ఎండు ద్రాక్ష తీసుకొని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన డ్రై ఫ్రూట్స్ తింటూ ఆ నీటిని తాగాలి.
బాదం పప్పు, జీడిపప్పు, నల్ల ఎండు ద్రాక్ష ఈ మూడింటిని మిక్సీ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని ఒక స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ పాలల్లో కలుపుకొని కూడా తాగవచ్చు. లేదా ఈ డ్రై ఫ్రూట్స్ ని పాలల్లో నానబెట్టి మిల్క్ షేక్ చేసుకొని కూడా తాగవచ్చు. ఎలా తీసుకున్న మంచి ఫలితం వస్తుంది.
ఇలా చేయటం వలన 15 రోజుల్లోనే బరువు స్పీడ్ గా పెరుగుతారు. శారీరక బలహీనత, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.ఎముకలు బలంగా మారుతాయి. రక్తహీనత సమస్య తొలగిపోతుంది.జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి బరువు తక్కువగా ఉన్నవారు ఈ రెమిడీ ఫాలో అయితే చాలా తొందరగా మంచి ఫలితం వస్తుంది.
గమనిక : ఈ ఆర్టికల్ ఒక అవగాహన కోసం మాత్రమే. ఏదైనా చిన్న సమస్య వచ్చిన డాక్టర్ సలహా తీసుకోవటం ఉత్తమం. గమనించగలరు.