Healthhealth tips in telugu

ఈ చెట్టు మీ ఇంట్లో ఉందా ? ఐతే ఈ నిజం తెలుసుకోండి…అసలు మిస్ కావద్దు

Erra Ganneru Benefits In telugu :అపోసైనేసీ కుటుంబానికి చెందిన ఎర్ర గన్నేరు అంటే మనలో చాలా మందికి తెలుసు. దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఈ మొక్కను అలంకారం కోసం మరియు ఎర్ర గన్నేరు పువ్వులను నిత్యం దేవునికి పెడుతూ ఉంటాం. ఎర్ర గన్నేరు మొక్కలను రోడ్డు పక్కన కూడా చూస్తూనే ఉంటాం. ఇవి ఎరుపు,తెలుపు, గులాబీ,పసుపు వర్ణంలో పూస్తాయి.
erra ganneru
అయితే ఎక్కువగా ఎర్ర గన్నేరు లభ్యం అవుతుంది. గన్నేరు పూలు శివునికి ఇష్టం. దేవాలయాలలో కూడా ఎర్ర గన్నేరు,పసుపు గన్నేరు మొక్కలను మనం చూస్తూనే ఉంటాం. ఎర్ర గన్నేరు మొక్క ఆకులు విషపూరితము. గన్నేరులో ఒలియాండ్రిన్, ఒలియాండ్రిజిన్ అనే రసాయనాలు ఉండడం వల్ల దీనిలో విషపుతత్వం ఉంటుంది.అందువల్ల గన్నేరును కడుపులోకి తీసుకోకుండా పై పూతగా వాడవచ్చు.

అయితే ఎర్ర గన్నేరు పువ్వులతో కొన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించు కోవచ్చు. ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. ఎర్ర గన్నేరు ఆకులు మోకాళ్ళ నొప్పులకు బాగా పనిచేస్తుంది. గన్నేరు ఆకులను బాగా కడిగి నీటిలో ఉడికించి నీటిని తీసివేసి ఆ ఆకులను నొప్పులు ఉన్న ప్రదేశంలో పట్టులా వేసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

గజ్జి,దురద వంటి సమస్యలకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. ఎర్ర గన్నేరు ఆకులు,పువ్వులతో కలిపి మెత్తని పేస్ట్ గా చేసి నువ్వులనూనెలో వేసి మరిగించి ఆ నూనెను వడగట్టాలి. ఈ నూనెను సమస్య ఉన్న ప్రాంతంలో రాసి రెండు గంటలు అయ్యాక స్నానం చేయాలి. ఈ విధంగా ఉదయం,సాయంత్రం చేస్తూ ఉంటే చాలా త్వరగా మంచి ఫలితం వస్తుంది. ఈ మొక్కను కేవలం బాహ్య పూతలకు మాత్రమే వాడాలి. ఈ విషయాన్నీ బాగా గుర్తుంచుకోవాలి.