శివశంకర్ మాస్టర్ బెస్ట్ సాంగ్స్ ఎన్ని ఉన్నాయో…?
Shiva Shankar Master Top 20 Choreography Songs : ఇటీవల కరోనా బారినపడి ఆసుపత్రిలో మరణించిన శివశంకర్ మాస్టర్ తెలుగు, తమిళ తదితర భాషల్లో ఎన్నో సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించారు. మెగాస్టార్ చిరంజీవికి స్టార్ డమ్ తెచ్చిన ఖైదీ మూవీలో రగులుతుంది మొగలిపొద, గోరింట పూసింది, వేదం నాదం అనే మూడు సాంగ్స్ కి సలీం మాస్టర్ తో కల్సి కొరియోగ్రఫీ అందించారు.
మంజునాథ మూవీలో ఓహో గరళా కంఠుడా సాంగ్ కి కొరియోగ్రఫీ అందించారు. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన అమ్మోరు సినిమాలో అమ్మా అమ్మోరు తల్లి సాంగ్ కి ఈయనే డాన్స్ కంపోజ్ చేసారు. అలాగే అరుంధతి మూవీలో భూ భూ భుజంగం ది త్తై తరంగం’ సాంగ్ ని అనుష్క, సోనూసూద్ లపై చిత్రీకరించగా, శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
దొంగది దొంగాడు మూవీలో మన్మథ రాజా అనే పాస్ట్ బీట్ సాంగ్ కి కూడా కొరియోగ్రఫీ అందించారు. బాలకృష్ణ నటించిన భలేతమ్ముడు మూవీలో మొత్తం పాటలన్నింటికీ ఈయనే డాన్స్ కంపోజ్ చేసారు. అలాగే బాలయ్య నటించిన అల్లరి పిడుగు మూవీలో మల్లెల్లోన ఇల్లెరో సాంగ్ కి కొరియోగ్రఫీ అందించారు. అవతారుడు మూవీలో హరి ఓం మాధవ సాంగ్ కి నృత్యం ఈయనే అందించారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో నూనోగు మీసాలొడు సాంగ్ కి శివశంకర్ మాస్టారే నృత్యరీతుల్ని సమకూర్చారు. అల్లు అర్జున్ నటించిన వరుడు మూవీలో ఐదు రోజుల పెళ్లి సాంగ్ లో ఓ ఘట్టానికి శివశంకర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. మహాత్మా మూవీలో నీలపురి గాజుల సాంగ్ కి కొరియోగ్రఫీ అందించారు.
నాగార్జున నటించిన ఢమరుకం మూవీలో శివశివ శంకర సాంగ్ కి కొరియోగ్రఫీ అందించి ఆకట్టుకున్నారు. మగధీర మూవీలో ధీర ధీర సాంగ్ కి కొరియోగ్రఫీ చేసారు. నాగపౌర్ణమి మూవీలో అందాల నాగవల్లి సాంగ్ కి కొరియోగ్రఫీ అందించారు. షకలక శంకర్ హీరోగా చేసిన డ్రైవర్ రాముడు మూవీలో టైటిల్ సాంగ్ ఈయనే కంపోజ్ చేసారు.