MoviesTollywood news in telugu

అల్లరి అల్లుడు సినిమాతో పోటీ పడిన సినిమాల పరిస్థితి…?

Allari Alludu Movie : డైరెక్టర్ ఏ కోదండ రామిరెడ్డి, అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన పలు సినిమాలు హిట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా అల్లరి అల్లుడు మూవీ ఒకటి. మాస్, రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. 1993అక్టోబర్ 6న రిలీజైన ఈ మూవీలో మీనా, నగ్మా హీరోయిన్స్. వాణిశ్రీ ప్రధాన పాత్ర పోషించింది.

కీరవాణి బాణీలు కుదిరాయి. 50సెంటర్స్ లో 50డేస్, 19సెంటర్స్ లో నేరుగా 100డేస్ ఆడిన ఈ మూవీ 7కోట్ల షేర్ తెచ్చింది.ఈ మూవీకి వారం ముందు విక్టరీ వెంకటేష్ నటించిన అబ్బాయిగారు మూవీ వచ్చింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మీనా హీరోయిన్. జయచిత్ర కీలక పాత్ర పోషించిన ఈ మూవీ హిట్ అయింది.

అక్టోబర్ 16న ప్రశాంత్, దివ్యభారతి జంటగా వచ్చిన తొలిముద్దు మూవీ లో దివ్యభారతి మధ్యలోనే చనిపోవడంతో ఆ ప్లేస్ లో కొంతభాగం హీరోయిన్ రంభ భర్తీ చేసింది. ఈ మూవీ ఏవరేజ్ అయింది. అల్లరి అల్లుడుకి పోటీగా చిన్నల్లుడు మూవీ వచ్చింది. సుమన్, రంభ, ఆమని నటించిన ఈ మూవీ అక్టోబర్ 19న వచ్చింది. శరత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కమర్షియల్ గా విజయాన్ని అందుకుంది.

అక్టోబర్ 21న ఎన్టీఆర్ నటించిన బాపు డైరెక్ట్ చేసిన శ్రీనాధ కవి సార్వభౌమ సినిమా వచ్చింది. అయితే పెద్దగా ఆడలేదు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన కిరాయి గుండా మూవీలో భానుప్రియ, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. ఎస్ ఎస్ రవిచందర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏవరేజ్ గా నిలిచింది.