మీరే చూడండి 2 నిమిషంలో దోమలు అన్ని పరార్
Home Remedies for Mosquito Bites In telugu : దోమలు కనపడగానే అందరు మస్కిటో కొయిల్స్ వెంట పడతారు. వాటి వలన కొన్ని సైడ్ ఎఫక్ట్స్ ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి దోమలను ఇంటి నుండి తరిమి కొట్టవచ్చు. దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
అన్ని మనకు అందుబాటులో ఉండేవే.దోమలు కుట్టాయంటే దద్దుర్లు వచ్చి నొప్పి మంట వంటివి వస్తాయి. మనం ఈ చిట్కా కోసం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఒక ప్రమిద తీసుకోని దానిలో నాలుగు లేదా ఐదు లవంగాలు వేసి మూడు కర్పూరం బిళ్లలను వేసి వెలిగించాలి. కర్పూరంతో పాటు లవంగాలు కూడా కాలుతూఉంటాయి . ఆ మంటకు లవంగాలలో ఉన్న ఆయిల్స్ రిలీజ్ అయ్యి పొగ వస్తుంది.
లవంగాలు,కర్పూరం బాగా కాలి వచ్చే పొగకు దోమలు పారిపోతాయి. సాయంత్రం అవ్వగానే ఇంటి మొత్తం డోర్స్ మూసేసి కేవలం మెయిన్ డోర్ మాత్రమే తెరచి ఉంచి లవంగాలు,కర్పూరం కలిపి వెలిగిస్తే వాటి నుంచి వచ్చే వాసనకు ,పొగకు దోమలు అన్ని ఇంటి నుండి బయటకు వెళ్లిపోతాయి. ఈ పొగను ఇల్లు మొత్తం స్ప్రెడ్ చేసాక 10 నిముషాలు అయ్యాక మెయిన్ డోర్ మూసేస్తే సరిపోతుంది.
మరొక చిట్కా ఏమిటంటే…కర్పూరం దోమలను తరిమి కొట్టటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కర్పూరం పొడిగా చేసుకొని కొబ్బరి నూనెలో కలిపి దీపాన్ని వెలిగిస్తే దోమలు పోతాయి. ఈ నూనెను చేతులకు రాసుకున్న దోమలు దగ్గరకు రావు.